మన సురవరం:---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మన తెలంగాణ ముద్దుబిడ్డ సురవరం
ఘన తెలుగు పలుకు తొణుకుల సరోవరం
ఆయన వందా ఇరువై ఐదొవ ప్రముక జయంతి నేడు
స్వయంగ వందనమర్పించి వారి జీవితంలోకి తొంగి చూడు !

ప్రాచీన పాలమూరు ఆ మహనీయుని ఖుద్దు అడ్డ
ప్రాచుర్యం పొందిన తెలంగాణ మన ముద్దుబిడ్డ
అతడే అతడే మన సురవరం ప్రతాపరెడ్డి
అహరహం మెరిసి పోవు మన బంగారపు కడ్డి

సమతా మమతల తాను కలగలిపి
తన కలం ద్వారా జాతిని మేల్కొలిపి
జాతిని జాగృతం చేసిన ఘనుడు
నీతిని సుకృతం చేసిన ఇపుడు

ఇజాలనిజాలు తెలియని నిజాం నిరంకుశత్వాన్ని
తన గళం గానంతో కలం కోణంతో ఎదిరించాడు
తెలంగాణ ముద్దుబిడ్డై న్యాయ శంఖం పూరించాడు
నిజాం నవాబుకు జవాబు చెప్పి తాను తెరదించాడు

మబ్బు వీడిన సూర్యుడులా ప్రకాశించినాడు
రాహువు వీడిన చంద్రునిలా వికసించినాడు
ధర్మానికి బద్ధుడై అధర్మానికి నిషిద్ధుడై
శోధించాడు సత్యాన్ని వధించాడు అసత్యాన్ని

కారు మబ్బులు కమ్ముకున్న వేళ
తాను వెరవక
కటిక చీకటి మట్టుపెట్టిన తాను పట్టుబడక
కాంతి పుంజం ఐ ఇలా వెలిగి ఆదుకున్నాడు
క్రాంతి బీజ మై శాంతివనంలో పాదుకున్నాడు

జాతకాల అఘాయిత్యాల అరికట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపెట్టి 
సమైక్యతను ఉద్ధరించిన తెలంగాణ ఉద్దండుడు
అవస్తలేని వ్యవస్థకు బీజం వేసిన మన ప్రచండుడు

గోలకొండ పత్రికను తన పుత్రికగా యెంచి
నిజానిజాలను ప్రజలందరికీ తాను పంచి
సంపాదకుడిగా వక్తగా కవిగా ఎదిగిన వాడు
సంవాద కుడిగా పరిశోధకుడిగా జనం గుండెల్లో ఒదిగిన వాడు

ఆయన ఆశయాల బాటలో అంతా చరిద్దాం
స్వయాన సంశయములేని ఫథాన్నే వరిద్దాం
వారు మనకు స్ఫూర్తిని కలిగించిన ప్రధాత
కోరి మన తలరాతలు తిరిగి రాసిన విధాత !

(వారి125 జయంతి సందర్భంగా)