నా కలల బాలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ 9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
టీవీ లో బాలు లేడన్న వార్త విన్న
బ్రహ్మాండం బ్రద్దలైపోయిందనుకున్న
ఠీవిగానేనిద్ర నుండినేనుమేల్కొన్న
కలవరమై ఇది కలయా నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా
నా మది నాకు జవాబు చెప్పకున్నా

వెంటనే దిగాలనలేచి కూర్చున్నా
నా కాళ్ళకింద నేల ఉందా లేదా యని కళ్ళప్పగించి చూసుకున్న
నేల ఎక్కడుందో అక్కడనే ఉంది
నా కాళ్ళ లో మాత్రం చలనం మాయమైపోయింది 
శూన్యం మాత్రం నా మదిలో మిగిలింది !

నిజం నిప్పులాంటిది అని ఎవరో
 అనగా విన్న
బాలు వార్త విని ఇప్పుడు ఆ నిజం తెలుసుకున్న
భూమిపై నూకలు ఉన్నంతవరకే ఎవరికైనా నా ఈ ధరణిపై నివాసం
ఆపైన కైలాసమే వారి ఆవాసం యని వెంటనే బాలుని చూడాలని
నేను అంతులేని కలలను కన్నా
కన్న కలలన్నీ కల్లలై పోయ గదన్న

నా ఆశ నిరాశ చేసి పాటల పల్లకి ఎక్కి టాటా చెప్పి 
వెళ్ళిపోయాడు గగనానికి ఆ గాన గంధర్వుడు
నిర్వేదంతో లేచి నిలబడలేక 
మంచం పై నుండి దబాలున క్రింద పడిపోయా కలలో ఓడి పోయా!

నా కల కరిగింది బళ్ళున తెల్లారింది
టీవీలొనుంచి ఆ బాలు గానం లీలగా మళ్ళి వినిపిస్తూనే ఉంది
ఆమె గానగంధర్వుడి కి లేదు మరణం
ఆ బాలు పాటల చరిత్రంతా స్వర్ణయుగమై మెరిసే అజరామరం
చేసుకుందాం మనం సదా స్మరణం 

తేది30 మే రాత్రి 6గం.నుడిప్రారంభమైన బాల సుబ్రహ్మణ్యం గారి కవి సమ్మేళనం లో చదివిన కవిత