బుజ్జి పాపాయి:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
బుజబుజ రేకుల మా బుజ్జాయి
వజ నే పోస్తా నువు బజ్జోవోయి
నే కొల్లాయి మల్లెంగ కట్టానోయి
నీ సన్నాయి రాగం పెట్టానో యి!

ఏడవకు ఏడవకు ఓ బుజ్జి పాపా
ఏడిస్తె రారెవరు నిన్నింక ఊపా
నీ నీలాలు కన్నీళ్ళు రాలనీకమ్మ
మాగోలాల ఆనీళ్ళు నిండనీకమ్మ!

బుజ్జి బుజ్జి పాపాయి రావమ్మా
నుజ్జునుజ్జు ఈ గుజ్జు తినవమ్మ
ఆగూటిలోని రూపాయి తేవమ్మ
నీతోటి పాపకి ఈవేళ ఇవ్వమ్మ!

ఓ బుజ్జి పాపాయి రావమ్మ
ఇక బజ్జో పెడతాను నేనమ్మ
నీ ఉయ్యాల జంపాల ఊపేస్తా
నే ఓ ఊహాలోకం చూపిస్తా ...!

ఓ చిన్ని పాపాయి రావమ్మా
ఆ కన్నీళ్లు ఎందుకు నీకమ్మా
తిరునాళ్లకు నిన్ను పంపిస్తా
తిరుపతి లడ్డును తినిపిస్తా.!

బంగారు పాపాయి రావమ్మా
కంగారు ఎందు

కు నీకమ్మ
నేనే రంగులరాట్నం ఎక్కిస్తా
శ్రీరంగని దేవునికి మొక్కిస్తా!

కంటి తడి నీవు పెట్టొద్దు
ఒంటిగా ఇంట్లో ఉండొద్దు
పోదాం పద ఇక బడికి
వేదం చెప్పే ఈ గుడికి!