బాజాల కాజాల పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ ర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
బాజాలు కొట్టేటి చిట్టి పిల్లలం
కాజాలు కుట్టేటి చిట్టి మల్లెలం
కుట్టుపని నేర్చుకున్న వారలం
గుట్టు కని ఓర్చుకున్న పోరలం!

ఓ అడ్డ పైన మాకొట్టును పెట్టుకున్నాం
మా గుడ్డలను పట్టుబట్టి కుట్టుకున్నాం
మేం రెడీ మేడ్ దుస్తులనే అమ్ముతున్నాం
గుడ్ విల్ కిస్తులందుకొనిగమ్ముగున్నాం

దర్జాగా మేమంతా దర్జీ పని చేస్తుంటాం 
ఆవర్జా గీసుకొని దుస్తుల కట్ చేస్తుంటాం
మార్కెట్  స్థితిగతులను గమనిస్తుంటాం
టార్గెట్ స్తిర లాభముల జమ చేస్తుంటాం

మేం వాయిద్య పరికరాలను కూర్చున్నాం
మా నైవేద్యం పరికర్మల నేర్చుకున్నాం
జరిగే విందు వినోదాల్లో మేం పాల్గొంటాం
ఒరిగే మా పొందు విషాదాల్లో మేల్కొంటాం.