కరోనా కష్టాలలో మనోధైర్యం*:-పబ్బ జోష్ణ ,మంచిర్యాల,:-చరవాణి:9491460490
 
*ప్రక్రియ పేరు:సున్నితం*
*రూపకర్త:నెల్లుట్ల సునీత*
********************
*11.*
కరోనా వచ్చిందని కంగారెందుకు?
 నివారణోపాయాలను నిర్లక్ష్యం చేయబోకు
 పరిస్థితేదైనా మనోధైర్యం వీడకు
చూడ చక్కని తెలుగు సున్నితంబు 
*12.*
టెలివిజన్  వార్తలను చూసి
అతిగా ఆలోచనలను చేసి
పిరికిగా మారకు జడిసి
చూడ చక్కని తెలుగు సున్నితంబు 
*13.*
పరిశుభ్రత పాటిస్తూ పోరాడుదాం
పౌష్టికాహారంతో ఇమ్యూనిటీ పెంచుకుందాం
సామాజికదూరంతో క్షేమంగా ఉందాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు 
 *14.*
ఆత్మీయుల పలకరింపు ధైర్యమిచ్చును
చిరుసాయమే  తోడ్పాటును అందించును
రోగికి కొండంత భరోసానిచ్చును
చూడ చక్కని తెలుగు సున్నితంబు 
*15.*
నేనున్నానను ధైర్యం నింపుదాము
తోచిన సాయంతో సహకరిద్దాము
 మానసిక స్థైర్యం పెంపొందిద్దాము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు