ముత్యాలహారాలు*:-*రాథోడ్ శ్రావణ్.ముత్యలహారం రూపకర్త* ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.9491467715
ఉమ్మడి కుటుంబాలు
వంశానికి మూలాలు
కుటుంబ సంప్రదాయాలు
అవి ఐక్యతకు రూపాలు

తాతా మనవడు ప్రేమలు
ప్రేమా అనురాగాలు
తరతరాల బంధాలు
తలపించు సందడులు

కుటుంబం గొప్పదనం
అమ్మబాపు బామ్మ మనం
మా ఊరికి  పయానం 
మాతోటి  జనం జనం

కుటుంబంలో ఐక్యత
అందరికీ  బాధ్యత
పిల్లలతో సభ్యత
కుటుంబలో ప్రాముఖ్యత

ఉమ్మడి కుటుంబాలు
ఆ ఇంట్లోనే విలువలు
ఖుషిఖుషితో నువ్వులు
ఆనంద సంతోషాలు

ఉమ్మడి కుటుంబాలు
మరపురాని జ్ఞాపకాలు
కబురులతో కళకళలు
గలగల చిరునవ్వులు

అమ్మా  చెప్పే నితులు
నాన్న చెప్పే సామెతలు
తాతా చెప్పే కథలు
గమ్మత్తుగా పిల్లలు

అమ్మ నాన్న బాబాయి
అక్కా చెల్లె   అమ్మాయి
పని చేస్తేనె రూపాయి
అవి ప్రేమను పంచుతాయి