తెలంగాణ, , గిరి పిల్లల గొప్పదనం *ముత్యాల హారాలు, రూపకర్త శ్రీ రాథోడ్ శ్రావణ్*-ఉట్నూర్, సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా=9491467715.
తెలంగాణ‌ కొండలు
జాలువారే నదులు
దట్టమైన అడవులు
పసిడి పండె భూములు‌. ‌ 

తెలంగాణ పండుగ
బతుకమ్మల పండుగ
గునకపూల పండుగ
డొలు,డప్పుల‌ పండుగ.  
 
తెలంగాణ సంస్కృతి
అందమైనది ప్రకృతి
గిరిజనులకు సోపతి
అడవి మాకు బహుమతి.  

కాకతీయ రాజులు
గణపతి రుద్రాంబలు
ధైర్యం సాహసాలు
పాలన యోధురాలు.  

తెలంగాణా కవులు
మా అక్షరపు శిల్పులు
మెదిలోన భావాలు
అక్షరాల అల్లికలు.  

తెలంగాణ పాటలు
మధురమైన పాటలు
కవన పూల తోటలు
మకరంద స్వరాలు. 

తెలంగాణ రైతులు
ఖరీఫ్,రభి కాలాలు
ఎకరాల్లో పంటలు
పండించే భూములు. 

ఎకరాల్లో భూములు
వ్యవసాయ దారులు
పోందేను లాభాలు
చిగురించిన ఆశలు. 

తెలుగు తల్లి బిడ్డలం
తేనెలూరే తెట్టలం
అడవి తల్లి బిడ్డలం
ప్రకృతి మాత పుత్రులం

భరత మాత బిడ్డలం
భూమాత పుత్రులం
పువ్వు లోని మొగ్గలం
కపటం లేని తారలం

చందనాల అడవులం
అడవిలోని పులులం
ఉట్నూరు వాసులం
సాహిత్యపు రాసులం

మేము గిరి పుత్రులం
మేము తినే అడవిఫలం
మట్టిలొ దొరలె పిట్టలం
గిరి జిల్లా వాసులం

తెలంగాణ విరులం
సీతాకోక చిలుకలం
కంటి పాపల కాంతులం
బడిలో తిరిగే బాలలం

బంగారపు బంతులం
కలములలోని  కవితలం
అడవిలోని చిరుతలం
రవిచంద్రుల వెలుగులం

మేము బడి పిల్లలం
లేలేత బుడుతలం 
పల్లెటూరి పిల్లలం 
చేనులోని మొలకలం

పట్నవాసపు పిల్లలం
పరిశ్రమల సరుకులం 
కష్టజీవుల పిల్లలం ‌
గిరి మాత వారసులం 

చుక్కల్లో చంద్రులం 
నిత్యకర్మ నిష్టులం 
సత్య హరిశ్చంద్రులం 
గిరుల తరుల వీరులం 

అందమైన బొమ్మలం 
పంచదార చిలుకలం 
పాల బుగ్గల పాపలం 
పానకాల గిన్నెలం 
  
పావురాల గుంపులం 
పాడి ఆవుల మందలం 
పసిడి వన్నె దూడలం 
ఇప్పపువ్వు లడ్డులం