ఆదివాసీ"పద్మశ్రీ" : -:రాథోడ్ శ్రావణ్, ఎఫ్ ఎ‌ సి ప్రీన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్.జిల్లా,9491467715
జైనూర్ మండలంలో
మార్లవాయి ఊరు
ఆదివాసులో పుట్టిన
కనక రాజు గారు
వారెవ్వా కనక రాజు
గుస్సాడీలకే రారాజు

మార్లవాయి  గూడేల్లో
విశిష్టమైన కళ
రేరేల దండారిలో
పద్మ వరించినవేళ
వారెవ్వా తొలి పద్మశ్రీ
నృత్య కళకే రాజు శ్రీ

యేత్మాసూర్  దైవభక్తి
నృత్య ప్రదర్శన శక్తి
కనక రాజు గారి కీర్తి
నవతరాలకు స్పూర్తి
వారెవ్వా కనక రాజు జీ
రాజగోండులకు రాజాజీ

ఆదివాసీ సంస్కృతి
గుస్సాడీ నృత్యంలో
గణతంత్ర వేడుక 
ఢీల్లీ ఎర్రకోట లో
వారెవ్వా రాజు పద్మశ్రీ
మన తెలంగాణాకు కీర్తి శ్రీ

పద్మశ్రీ పురస్కారం
రాజు వార్తాతో జనం
డెబ్భైరెండొ గణతంత్రం
రాష్ట్రపతి సన్మానం
వారెవ్వా  కనక రాజు
నృత్య ప్రదర్శనలో మహారాజు

ఆదివాసీ గూడలో
దేవతల పూజలు
డోళ్ళు,డప్పులతో
దండారి నృత్యాలు
వారెవ్వా ! గుస్పాడీలు
మీ కాళ్ళకు ఘల్లు ఘల్లు గజ్జెలు

దీపావళి ఉత్సవం
మదిలో ఆనందం
నేమలి ఈకల‌ కిరీటం
పాటాల్లో మకరందం
వారెవ్వా ! దండారి
ఎత్మాసూర్ పెన్ చూపేను దారి

గిరిజన కళా రూపాలు
దేవుడు ఇచ్చిన వరాలు
సంగీత వాయిద్యాలు
అడే డెంసా నృత్యాలు
వారెవ్వా ! గుస్సాడీ
అదే కనక రాజు గారి గారడి

గుస్సాడీ నృత్యాన్ని
రాజు ప్రదర్శిస్తూ
దేశ వ్యాప్తంగా
రాజును అభినందిస్తూ
వారెవ్వా! మీ నృత్యఅద్భుతం
మీ గుర్తింపుతో గొప్పదనం

కామెంట్‌లు