ప్రక్రియ: సున్నితం:రూపకర్త:: నెల్లుట్ల సునీత : *కరోనా కష్టాల్లో మనో ధైర్యం*:- *గీతారాణి అవధానుల (మయూఖ)* స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ మంథని ,పెద్దపల్లి జిల్లా-9491475210

 6.
అంతటా కరోనా కలకలం..
చేస్తుంది మనసులు వికలం..
వణుకుతోంది లోకం సకలం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..
7.
పెంచుతోంది మనుషుల్లో దూరం..
తమవారికి తామే భారం..
ఎన్నడూ లేదింతటి ఘోరం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..
8.
ఎన్నో ప్రాణాలను హరిస్తోంది..
ఏకంగా కుటుంబాలనే కబళిస్తోంది..
మనఃశాంతిని లేకుండా చేస్తోంది..
చూడచక్కని తెలుగు సున్నితంబు..
9.
ఎప్పుడూ కోల్పోకూడదు స్థైర్యం..
ఇప్పుడు కావల్సింది మనోధైర్యం..
ఆగాలిక కరోనా క్రౌర్యం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..
10
టీకాతో కరోనా ఆటకట్టగా..
పోషకాహారంతో నిరోధకత పెంచేట్టుగా..
జాగ్రత్తగా ఎదుర్కోవాలి కలిసికట్టుగా..
చూడచక్కని తెలుగు సున్నితంబు..