ఈ ప్రక్క ఆ ప్రక్క ఏ ప్రక్క చూసినా
ఈ వీధి ఆ వీధి ఏ వీధీ చూసినా
ఈ వాడ ఆ వాడ ఏ వాడ చూసినా
చూసిన వాడలన్నీ కరోన వాడలే !!
చెమక్కులే పి.వి.యల్. చమక్కులే!
కబళించిన కరోన వాడలని
కబలించని కరోన వాడ ఏదని
కాపాడే దారే దైనా ఉండదాని
జాగ్రత్తలే జాస్తని అదే రామ రక్ష !!
చెమక్కులే పి.వి.యల్. చమక్కులే!!
ఇంట్లో బయటైనా ఆ సోదే
మాట మంతీ ఏదైనా ఆ యాదే
ఫోన్ ఎత్తి నా ఫోన్లో తీసిన ఆ రందే
దూరం దూరం ఉంటేనే ప్రాణం నిలబడు!!
చెమక్కులే పి.వి.యల్. చమక్కులే!!
తుమ్మెచ్చినా దగ్గొచ్చినా అమ్మో
జ్వరమెచ్చినా జలుబు చేసినా అమ్మో
ఒంటి నొప్పిలే ఆయాస మేదొచ్చినా అమ్మో
అనుమానమే అదేనేమో కరోనా కాకపోదూ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి