విడుదల (కథ):-.గంగశ్రీ 9676305949
 ప్రవీణ్ : "ఒంట్లో కొద్దిగా నలతగా, ఒళ్ళంతా మర్దన చేసినట్టుగా ఉంది".
మాధవి:  "ఎప్పటినుంచి?"
ప్రవీణ్: "ఇప్పుడిప్పుడే గంట నుంచి"
మాధవి: "ఎందుకైనా మంచిది ఓసారెళ్లి టెస్ట్ చేయించుకోండి"
ప్రవీణ్ మూతికి మాస్కేసుకొని శానిటైజర్ రాసి, బైక్ మీద కోవిడ్ టెస్ట్ సెంటర్ కి చేరుకునే సరికి, లాక్ డౌన్ ఎత్తేసిన రోజు వైన్ షాప్ ముందరున్నంత లైనుంది అక్కడ.
సినిమా చూసినంత సమయం తర్వాత ప్రవీణ్ నెంబరొచ్చింది.
డాక్టర్: "ఏమనిపిస్తుంది"
ప్రవీణ్: "ఒళ్లంతా నొప్పులు"
డాక్టర్: "బ్రీతింగ్ ఎలా ఉంది?"
ప్రవీణ్: "బాగానే ఉంది"
డాక్టర్ టెంపరేచర్ చెక్ చేసి, కొంచెం జ్వరం కూడా ఉంది. పాజిటివ్ అనిపిస్తుంది అనగానే ప్రవీణ్ గుండెల్లో డీజే సాంగ్స్!
డాక్టర్: "భయపడాల్సిందేమీ లేదు, స్టార్టింగ్ లో ఉన్నట్టుంది" అన్నాడు.
రాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ తో కొంచెం తేలిక అనిపించింది ప్రవీణ్ కి.
డాక్టర్: "ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేస్తాను. టూ డేస్ తర్వాత మీ మొబైల్ కి రిపోర్టు రాగానే, ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటూ కొన్ని మందులు ఇచ్చి వాడుమన్నాడు."
ప్రవీణ్: "అంటే, ఇప్పుడు నెగిటివ్ గానే ఉంది కదా సార్?"
డాక్టర్: "లేదు, అలా అనుకోవద్దు, ఎందుకైనా మంచిది మీరు 14 రోజులు క్వారంటైన్ లో ఉండండి. ప్రత్యేక గదిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ఇంట్లో కూడా మాస్క్ వాడాలి" అన్నాడు.
బండి దిగి, ఇంట్లోకి నీరసంగా వస్తున్న ప్రవీణ్ ని చూసి, మాధవి "డాక్టర్ ఏమన్నాడు?" అంటూ దగ్గరగా రాబోతే, దూరం జరిగి విషయం చెప్పాడు. మాధవికి లోపల భయంగా ఉన్నా, ధైర్యం తెచ్చుకుని, భయపడకండి.ఏం కాదు అంది. వాళ్లది అసలే సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్. అటాచ్డ్ అండ్ కామన్ బాత్ రూమ్ ఉండడం కొంచెం ఊరట.
మూడు సంవత్సరాల బాబు ఉండడంతో కాస్తా భయం.
         బెడ్ రూమ్ లోకెళ్ళి రోజు అవసరపడే సామాన్లు హాల్లోకి, కిచెన్ లోకి మార్చి ఐసోలేషన్ రూమ్ చేసి, క్లీన్ చేసింది. ప్రవీణ్ అడుగులో అడుగేసుకుంటూ వచ్చి రూమ్ లో నడుం వాల్చాడు. మాధవి ప్రవీణ్ ధైర్యం చెబుతూ, టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టి అతని రూం ముందుంచి తినమంది.
రెండు రోజుల తర్వాత ఆర్ టి పి సి ఆర్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో భయంతో మాధవికి చెప్పి, కంగారుగా డాక్టర్ కి ఫోన్ చేసాడు.
డాక్టర్: "14 రోజులు క్వారంటైన్  లో ఉంటూ, ఏదైనా నా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయండి" అన్నాడు.
           మాధవి ధైర్యపు మాటలు, సరదా కబుర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పద్నాలుగు రోజులు ఉల్లాసంగా గడిపి రూమ్ క్లీన్ చేసి, స్నానం చేసి నేరం చేయని ఖైదీలా జైలు నుంచి బయట పడ్డాడు ఆనందంతో!
                ..