కృష్ణుని నిర్యాణం:-వరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట-చరవాణి:9704865816

 1కం
అరికాలు జింకయనుకొని
శరమును సంధించెబోయ సత్వరముగతాన్
హరియేనిచ్చినవరమును
నెరవేరెను నాటితోడ నియమము దప్పన్
2ఆ.వె.
వేటగాడు వచ్చి
వేగిరంబుగచూడ
తప్పుజేస్తి ననుచు నొప్పుకొనగ
నెవరికర్మ బ్రహ్మ నెటులను వ్రాసెనో
తెలియ లేరు నెవరు తేజముగను
3ఆ.వె
తప్పుజేసెనేని తప్పక భోగించు
హింసనరుడగాడె హింసపాలు!
మంచిపనులు జేయ మంచిదే లోకాన
నీతినెరిగి నడువ నిత్యశుభము
4ఆ.వె.
దేవదేవుడైన తీరదు కర్మయు
చేసినట్టి పనులు చెంతనుండు
అనుభవించనదియె నంతమైపోవును
విధియు ధర్మమిదియె వినగజగతి
5కం.
కలియుగ వేల్పుగ వెలిసెను
సలలితముగవిష్ణువపుడు సంతోషముగన్
ఇలభక్తజనుల బ్రోవగ
కలిమియు సౌఖ్యంబునిచ్చి కావగ నెపుడున్!