కరోనా కష్టాల్లో మనోధైర్యం :-: పిల్లి.హజరత్తయ్యకలం పేరు :రత్న శ్రీ -చరవాణి: 9848606573

*ప్రక్రియ పేరు  : సున్నితం*
రూపకర్త :  నెల్లుట్ల సునీత గారు

****************
61) కరోనా కోరలకు చిక్కవద్దు
ఇల్లు,ఒళ్ళును గుల్లచేస్తుంది
మనోధైర్యమే కరోనాకి మందు  
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

62) ఆశలను ,ఆశయాలను ఛిదిమేస్తుంది
ప్రాణాలను చితికి వేలాడదీస్తుంది
మానసికసంఘర్షణను జయించు ముందు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

63) కరోనా జీవితాలను చుట్టేస్తుంది
కుటుంబాలు కుటుంబాలనే మింగేస్తుంది
స్వీయనియంత్రణే మనకు శిరోధార్యము
*చూడచక్కని తెలుగు సున్నితంబు

64) ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తుల ఆర్తనాదాలు
మనుషుల్లో తీరని మనోవేదనలు
ఒత్తిడిని నివారించడమే దివ్యౌషధము
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

65) ధైర్యంతో ముందుకు సాగు
కరోనా వ్యాక్సిన్ ని  స్వీకరించు 
మనోనిబ్బరంతో కరోనాను జయించు
చూడ చక్కని తెలుగు సున్నితంబు