కోతుల ప్రభువు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.మొబైల్: 9908554535.

  కౌశాంబీ రాజ్యంలో కోతుల బెడద ఎక్కువైంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు బ్రహ్మదత్తుడు పండితులు అందరినీ సమావేశపరిచి కోతులను అరికట్టే మార్గాలు చెప్పమన్నాడు. అప్పుడు పండితులు వివిధ రకాల ఉపాయాలు చెప్పారు. కొందరు పండ్ల చెట్లను పెంచాలని, మరికొందరు అడవుల్లోనే వాటికి ఆహారం పెట్టాలని ,ఇంకొందరు వాటి సంతాన ప్రాప్తిని నిరోధించాలని చెప్పారు .
         ఆ సమావేశంలో పాల్గొన్న  తిమ్మన్న అనే పండితుడు కోతులు మన వద్దకు రాకుండా ఉండాలంటే కొండెంగలను పెంచాలని చెప్పాడు. అప్పుడు మిగతా పండితులు నవ్వి  "తిమ్మన్న కోతి బుద్ధిని  పోనిచ్చుకున్నాడు కాదు" అని అన్నాడు.
" అసలు వారే కోతి" అని మరొక పండితుడు అన్నాడు. అప్పుడు సభ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది.
         తిమ్మన్న వారికి బదులిస్తూ "మనమంతా కోతుల నుండి వచ్చాము కదా! మీరు కోతులు కారా ఏమిటి" అని అన్నాడు. అప్పుడు రాజుగారు కలుగజేసుకుని "తిమ్మన్న గారు సభ అంతా కోతుల మయం చేశారు. నేను కూడా కోతిని కదా "అని అన్నాడు .అప్పుడు మంత్రి గారు" అయ్యా !మీరు నేను పెద్ద కోతులం" అని నవ్వాడు . వెంటనే తిమ్మన్న" అదేం లేదు మహారాజా! మీరు కోతుల ప్రభువు .అతడు కోతుల మంత్రి .మీరు పెద్ద కోతులు  ఎలా అవుతారు? మేమందరం కోతులం. మీరు మా ప్రభువు సుగ్రీవుల వారు. వారు ఆంజనేయులు. ఇది కిష్కింద "  అని అన్నాడు. ఆ మాటలకు రాజు మంత్రి ఎంతో సంతోషించారు.సభంతా  నవ్వులతో నిండిపోయింది.
       అందుకే సమర్థులైన వారు అవమానాలపాలు కారు. వారు తమపై వచ్చిన  విమర్శలను  తిప్పి కొడతారు కూడా.