రమేష్ కొత్తగా చీరల షాపును పెట్టాడు. చీరల్లో లాభం బాగుగా ఉంటుందని,స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని అతని మిత్రుడు చెప్పాడు .అందువల్ల చాలా రకాల చీరలను అతడు తెచ్చాడు .
కొన్ని రోజుల తర్వాత అతని షాపుకు ఒక మహిళ వచ్చి పట్టు చీరలు చూపించమంది. రమేష్ రెండు చీరలు చూపిస్తూ" ఈ చీరలు అన్ని అమ్ముడుపోయి ఈ బ్రాండ్ వి రెండు మాత్రం మిగిలినాయండీ! బాగుంటాయి. తీసుకోండి" అని అన్నాడు .అప్పుడు ఆ మహిళ" నాకు రెండు సరిపోవండీ. పది కావాలి "అని అంది ."అయితే వేరే చూపిస్తాను ఉండండి "అన్నాడు రమేష్ . "వేరే నాకు అక్కర్లేదండీ! ఇవే ఇప్పుడే అర్జెంట్ గా కావాలి" అంటూ వెళ్ళిపోయింది .
ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి మరొక స్త్రీ ఆ షాప్ కు వచ్చింది . "మంచి చీరలు చూపించండి" అని అంది. రమేష్ కొత్త బ్రాండ్ వి చాలా రకాల చీరలు చూపించాడు . "ఇవి ఎంతవరకు అమ్ముడుపోలేదండీ! అందుకే మీకు చూపిస్తున్నాను . బహుశా ఇతరులు ఎవరూ కూడా వీటిని కట్టి యుండరు "అని అన్నాడు .అప్పుడు ఆమె
" అమ్ముడుపోని ఈ చీరలు నాకెందుకు "అంటూ రమేష్" వేరే చూపిస్తానండీ" అని మొత్తుకుంటున్నా వినకుండా వెళ్ళిపోయింది.
కొద్ది సేపు అయిన తర్వాత మరొక మహిళ షాపుకు వచ్చి చీరలు చూపించమన్నది. ఇదివరకు ఉన్న అనుభవంతో రమేష్
"అమ్మా! మీకు ఎలాంటి చీరలు కావాలి "అని అడిగాడు. ఆమె " ఎవరూ కట్టనటువంటి చీరలు ఉన్నాయా "అని అడిగింది . అతడు" ఆ . ఉన్నాయి. అమ్మా! ఇదిగో "అంటూ కొన్ని చీరలు ఆమె ముందర వేశాడు. " ఎవరూ కట్టని చీరలు నాకెందుకు" అని ఆమె కూడా వెళ్ళిపోయింది. రమేష్ కు చీరలు ఎలా అమ్మాలో తెలియరాలేదు.
అందుకే వ్యాపారంలో అనుభవం ఉండాలి అంటారు పెద్దలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి