ఆటవెలది పద్యాలు--దేశ భక్తి:-సముద్రాల శ్రీదేవి, 9949837743

 ఆ.వె.
దేశ భక్తి యున్న దేహము ధన్యము
నేల తల్లి మురియ నింట సిరులు 
.మమత సమత పంచు మర్యాద మించగా
మేలుగొలుప జాతి మేలిమగును
ఆ.వె.
మతముఐకమత్య హిత సహవాసము 
కులము మంచి తనముకు సహవాసి 
బ్రతుకు సామరస్య భావ సంచారిణి 
ప్రజలు శాంతి సుఖము బడయవలయు 
ఆ.వె.
భరత దేశ మొకటి బంగారు భూమియై
వెలిగె జిలుగు తోడ విభవమొప్ప
శక్తి యుక్తి కలిగి శత్రువులనణిచి
వీరజాతి యనుచు
విశద పరచె
ఆ.వె
స్వచ్ఛమైన  ధరణి స్వేచ్ఛను రక్షించి,
బడుగు జీవి వెతల బ్రతుకు చూసి,
కడుపు నింపు నిండు కరుణయు కలిగించు
జగము కీర్తి కలిగి జయము పొందు.