గజల్:-సముద్రాల శ్రీదేవి-9949837743
నిన్ను నీవు గెలుచుటకై మిన్ను వరకు ఎదిగిపో
విత్తనమై దాగుండక మన్నువరకు ఎదిగిపో

పగవాడిని ఎదురుకొనెడి దారిలోన ఓడకను
మెత్తదనపుచూపులతోజున్నువరకు
ఎదిగిపో

ధర్మాన్నే వీడకుండ అధర్మనా నడువకను
గొప్పతనమునింపుకొంటుకన్ను వరకుఎదిగిపో

గజలుగాను నిన్నునీవు చెక్కుకుంటు పదాలకు
మొక్కుకుంటు
తెలుగులోని
అన్నువరకుఎదిగిపో

సంఖ్యలతో సహవాసిగ అంకెలతో ఆడుకొని
గణితములో మేధాతో ఎన్నువరకు ఎదిగిపో

బాధలన్ని రాళ్లైతే భారాన్నే దించుటకు
తెలివియనెడి గొప్పనైన గన్నువరకు ఎదిగిపో

పగటినంత వెలుగిస్తూ రాత్రిలోన కనపడక
సూర్యుడిగా మారుటకై 
చెన్ను వరకు ఎదిగిపో

పంటనంత
పండించిన
ఫలరాశులుపొందుటకు
ఊరిచివరి తొలిచివేసె జిన్ను వరకు ఎదిగిపో

అస్తులేమి లేకున్నును కష్టమనెడి
పెట్టుబడి
శ్రీదేవిగ పిలుచుకొంటె పన్నువరకు ఎదిగిపో