మనసు గుర్రం:-డాక్టర్ అడిగొప్పుల సదయ్య-9963991125
కోటి ఆశలలో
కొన్ని ఉండాల్సినవి
కొన్ని ఉండకూడనివి
మనసుకు ఉండకూడని ఆశలపై ఆశ
బుద్ధికి ఉండాల్సిన ఆశలపై మక్కువ
మనసు,బుద్ధి రెండూ పోటీపడుతుంటాయి
తనదే పైచేయి కావాలని
ఒక్కోసారి మనసు గెలుపు గుర్రమవుతుంది
ఫలితం: అత్యాచారాలు,దొంగతనాలు,మారణహోమాలు,..
ఎప్పుడో ఒకప్పుడు
బుద్ధి గెలుపు గుర్రమవుతుంది
ఫలి

తం: పరోపకారాలు,మంచితనాలు, సేవాతత్పరత,...
మనసు గెలిస్తే రావణులౌతారు
బుద్ధి గెలిస్తే రాముళ్ళవుతారు
కోటి ఆశలలో మనసు గెలిచే ఆశలే ఎక్కువవుతున్నాయి
అందుకే ఈ లోకంలో మంచి వెతికినా కానరావట్లేదు

ఎపుడైతే కోటిఆశలలో బుద్ధి గెలుపుగుర్రమవుతుందో
అపుడే ఈ జగతి శాంతి సౌభాగ్యాలతో,క్షాంతి సౌజన్యాలతో 
పరిఢవిల్లుతుంది