తెలివితక్కువరాజు :-కంచనపల్లి ద్వారకనాథ్,-చరవాణి :: 9985295605

  విళంభిపుర రాజ్యాన్ని   విచిత్ర వీరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు . ఒకరోజు అద్దంలో తన అందమైన ముఖాన్ని చూసుకుని మురిసి పోతూ తల వెంట్రుకలలో తెల్ల వెంట్రుకలు రావడం చూసుకుని “అయ్యో .. ఇంత చిన్న వయసులోనే ఇలా తెల్లవెంట్రుకలా .. ఇంకా ముందు ముందు ఏమైపోతానో ..నా యవ్వనాన్ని ఎలాగైనా అలానే జీవితాంతం వుండేటట్లు చేసుకోవాలి “ అని   ఆలోచచిస్తూ  బాదపడుతూ రోజులు గడప సాగాడు  
 ఒకరోజు ఆ రాజ్యానికి ఒక ఆయుర్వేద  వైద్యుడు వచ్చాడని  ఎలాంటి సమస్యలైనా బాగుచేస్తాడని  రాజు పడుతున్న బాధకు పరిష్కారం దొరుకుతుందేమోనని  రాజుగారికి  భటులు  వచ్చి  చెప్పగానే వెంటనే రాజు అతన్ని తన దగ్గరకు తీసుకు  రమ్మని     భటుల్ని  పంపాడు  . 
       రాజుగారి వద్దకు వచ్చిన     ఆయుర్వేద వైద్యుడు రాజుకు నమస్కరించి “ మహారాజా.. నా పేరు ఘటికాచలం .  మీ సమస్యను నాకు చెపితే నేను సరైన పరిష్కారం చూపిస్తాను “ అన్నాడు .”రాజు ‘ భలే ..నీ వేషం , నీ మాటలు చూస్తుంటే ఎన్నో  ఏళ్ళ అనుభవం  వున్నాట్టు అనిపిస్తోంది .నా సమస్య అంతా ఒకటే నేను ఇప్పుడు వున్న వయస్సు లో ఎలవున్నానో అలానే జీవితాంతం వుండిపోవాలి .అందుకు ఏదైనా మందు మాకు మార్గం  వుంటే చెప్పండి ఎంత ఖరీదైనా పర్వాలేదు మేము ఇచ్చుకుంటాము “.  మీసాలు  దువ్వుతూ  అన్నాడు.
“మహారాజా ఇది పెద్ద సమస్య కాదు .  తమకు ఒక కషాయం  ఇస్తాను.   మూడు  పూటలా భోజనానికి ముందు  అర్థ  అరలోటా కషాయం     పది రోజులు తాగితే .మీరు కోరుకున్నట్లు ఇప్పటిలాగే  ఎప్పటికీ వుండి పోతారు .  మీ తెల్ల   వెంట్రుకలు గూడా నల్ల  పడిపోతాయి. మీకు మంచి  బలం చేకూరుతుంది. “   వైధ్యుడు  అనగానే    “ ఊ(.. ఘటికాచలా  నీవు ఈ   పది రోజులు ఇక్కడే వుండు . నీకు సకల మర్యాదలు జరుగుతాయి . నాలో నీవు ఇచ్చిన ఔషదప్రభావం లో ఎంతమార్పు  వస్తుందో  నీకు చూపించాలికదా “ అన్నాడు .”చిత్తం ప్రభు   ...అలాగే “ అన్నాడు   తన చేతి సంచిలో నుండి   కషాయం సీసా  రాజు గారి  చేతికి అందిస్తూ  రోజు రాజుగారు  కషాయం   తాగుతూ  అద్దంలో చూసుకుంటూ పది రోజులు గడిచినా ఏమార్పు  కనిపించక పోగా తెల్ల వెంట్రుకలు నల్లగా కాలేక పోవడంతో వైద్యుడు అబద్దాలు చెప్పినట్లున్నాడు .. నన్నెమోసం  చేస్తాడా ? అని కోపంతో భటులను పిలిచి వైద్యుని తనవద్దకు తీసుకురమ్మని పంపాడు . 
రాజుగారి ముందుకు వైద్యుని   తీసుకొచ్చి   భటులు నిలబెట్టారు    రాజు “ ఏమోయ్    వైద్యుడా  .. నన్నే మోసం చేస్తావా .ఎంత ధైర్యం నీకు ..  నీవు ఇచ్చిన కషాయం నాలో ఏమార్పు   తీసుకురాలేదు . అందుకు నీకీ కారాగార శిక్ష తప్పదు .  ఇతన్ని కారాగారం లో   తోయండి అని    అరిచాడు వైద్యుడు ఘటికాచలం నవ్వుతూ  “  మహారాజా మీరు కోరినట్లే నేను మీకు కషాయం  ఇచ్చేటప్పుడే మీకు చెప్పాను మీరు ఇప్పుడు వున్నట్లే ఎప్పుడు వుంటారు అని  . మీరు  ఈ రోజుకి మీ  కోరినట్లు మీరు పదిరోజుల ముందు ఎలావున్నారో అలానే వున్నారు కదా “  అన్నాడు  రాజుకి ఇంకా కోపం  ఎక్కువై “రాజు గారితోనే వేళాకోలం ఆడుతున్నావా ?  నీ తల తీయిస్తాను “ .జాగ్రత్త అన్నాడు .  మహారాజా మీరు తెలివి తక్కువ వారు అందుకే నామాట విన్నారు . ఈ ప్రపంచంలో  నల్లవెంట్రుకలను తెల్లవిగా,  జీవితాంతం యవ్వనంతో వుండేటట్లు చేయగల మ౦దులు , మంత్రాలు లేవు . అలా౦టివి తయారు చేసే వాళ్ళు వుంటే ఎన్నో కోట్ల రూపాయలు సంపాదనతో  ధనవంతులు   ఎందరో వుండేవాళ్లు “  అన్నాడు .  ఇంతలో ఒక భటుడు “మహారాజా .. మన్ని౦చండి .. ఇతను మన మహామంత్రి  జ్ఞానoదులవారు మీరు తను ఇచ్చిన సలాహాలు ఏనాడూ  పాటించక  పోగా   రాజ్య బహిష్కరణ  చేశారు . కానీ మీ   ఉప్పుతిన్న రాజ భక్తితో మన రాజ్యాన్ని కాపాడడానికి ఈ వేషం  వేయవలసి వచ్చింది . మీరు  ఇతన్ని బహిష్కరణ చేసినప్పతటి ను౦డి మన సైన్యాధి పతి మిమ్మల్ని వధించి  ఈ రాజ్య సింహాసన్నాన్ని  ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్న విషయం మాకు తెలియడంతో   మేము  వీరిని    కలిసి ఈ విషయం  చెప్పగా ఈ మంత్రిగారు ఈ వేషంలో ఇక్కడకు రావలసి వచ్చింది . అన్నాడు . 
   మహామంత్రి రాజుకి  నమస్కరించి   “  క్షమించండి మహారాజా .. మన రాజ్యం కోసం ఎన్నో సార్లు మీరు చేస్తున్న తెలివితక్కువ  పనులను మీకు అర్థమయ్యేలా చెప్పినా వినకుండా నన్ను   రాజ్య   బహిష్కరణ చేశారు . ఈ రోజు నేను మిమ్మల్ని మోసం  చేశాను అంటున్నారు . కానీ మన సైన్యాధి పతి మీ తెలివితక్కువతన్నాన్ని చూసి     సైన్యాధి పతి కుట్ర  పన్ని     మన  స్వాధీనం  చేసుకోవడం నాకు   ఇష్టంలేక  మీ బలహీనతను ఆధారం   చేసుకుని మరలా  ఈ రాజ్యంలో అడుగు  పెట్టాను . మీకు ఇచ్చిన కషాయం బలానికే కానీ అది మీ కోరిక  తీర్చేది కాదు.  ఇకనైనా మీరు తెలివిగా ప్రవర్తించండి . తప్పుగా   మాట్లాడితే శిక్షించండి “అన్నాడు వినయంగా  తన  వేషం  తీసేస్తూ . 
రాజుకి జ్ఞానోదయం కలిగి తాను చేస్తున్న తెలివితక్కువ పనులు గుర్తుకురాగా “మహామంత్రి నీవు నిజంగా ఘటి కాచలం కాదు ఘటికుడివి . నీవే మా కర్తవ్యాన్ని గుర్తు చేశావు . భటులారా సైన్యాధిపతిని బంధించి చెరసాలలో వేయండి అని ఆజ్ఞాపించాడు .