నోటి దురుసు పెద్ద పులి :-క౦చనపల్లి ద్వారకనాథ్ చరవాణి : 9985295605

  ఒక అడవిలో లో పెద్దపులి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఒక పెద్ద పాండా చెట్టు కింద పడుకుని దిక్కులు  చూస్తోంది . ఆ చెట్టు పై నుండి ఉడుత  ఒకటి కిందకు వచ్చి  తోక జాడిస్తు మూతిని చేతులతో  తుడుచుకుని అప్పుడప్పుడు తోక అరుస్తూ  వుండడం చూస్తున్న పెద్ద పులి నవ్వి ‘ ఏయ్...  బుడుత వుడుతా   నీవు ఎంత తోక జాడించినా భయపడుతాను అను కుంటున్నావా ? నేను  పెద్ద పులిని  ‘ అని   గాండ్రించింది .  ‘ నేను నిన్ను చూసి జాడించలేదు . అది  నా పుట్టుకతో వచ్చిన   నైజం’అంది ఉడుత .’ నాకే ఎదురు చెపుతున్నావా .. ఎందులో  నీవు గొప్ప  ?   చెప్పు’ అని పులి  అంది . ‘ నేను విష్ణు దేవుడు రామావతారం ఎత్తినపుడు   సముద్రానికి వారధి కట్టడానికి సహాయం చేశాను . అందుకు శ్రీరామదేవుడు మూడు వేళ్ళతో  నా వీపుని నిమిరి చారలు గీశాడు తెలుసా  ? ఆదేనాగొప్ప ‘అంది .దానికి  పెద్దపులి ‘ నీకు మూడు చారలే .. కానీ నాకు చూడు వంటి   నిండా  చారలే... హ్హ..హ్హ ..హ్హా ... హ్హ ‘అని నవ్వింది .
అందుకు ఉడుత ‘ ఆ చారలు నీకు ఎవరు ఇచ్చారో  చెప్పు ‘ అంది .  పెద్దపులి  నోటిదురుసుతో అన్నమాటకి  ఆలోచనలో  పడి దిక్కులు చూస్తూ ఏమి చెప్పాలో అర్థంకాక తల గోక్కుని చెప్పలేకపోయింది . 
 ఉడుత ‘  నీవు చెప్పలేవుకాని నేను చెప్తావిను. పులిరాజా గారు .. . ఏ జన్మలోనో ఏ రాక్షసుడికో సహాయం చేసి వుంటావు .అందుకే నీకు తనాల బతకమని  వాడిలా పళ్ళు ,గోళ్ళు  ఇచ్చాడు . అందుకే  నీవు  మాంసాహారం  మాంసాహారం తింటున్నావు . నేను  సాత్వికాహారమైన పళ్ళు , కాయలు తింటూ బతుకుతున్నాను ‘   అని తోక జాడిస్తూ కిచ కిచ అరుస్తూ  చెట్టు పైకి పోయి  పండు   కోరుకుతూ కూర్చుంది . పులి తన దారిన తాను పోక  చిన్న బుడుత ఉడుతను గోకి అపహాస్యం పాలై  నందుకు తల వంచుకుని అక్కడనుండి వెళ్ళి పోయింది .
కామెంట్‌లు