ప్రకృతి :- కంచనపల్లి.ద్వారకనాథ్ : చరవాణి:9985295605


  ప్రత్యూష రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు .  తన  మంత్రి హరిక్షేత్రుడిని  పిలిచి “ మన రాజ్యంలోని రాములయం లో     ప్రతి  ఏటా   చైత్ర  మాసంలో     జరిగే   బ్రహ్మోత్సవాలు ఈ సారి ఘనంగా చేయాలి . భక్తుల మనోభావాలకి ఎలాంటి భంగం కలగకూడదు .  అందుకు కావలసిన సంజామను గుడి పూజారి వద్దకు వెళ్ళి తెలుసుకుని  తగిన  ఏర్పాట్లు చేయండి ”  అన్నాడు  . “చిత్తం మహారాజా ´అనివెళ్లిపోయాడు 

 హరి క్షేత్రుడు  గుడి పూజారి విష్ణు చిత్తు ని కలవడానికి గుడిలో అడుగు పెడు తుండగా   ఎదురువచ్చిన పూజారి చూసి  నమస్కరించాడు . “  మహామంత్రి గారు నీనే మీ మహారాజును కలవడానికి బయలు దేరాను అంతలో మీరు ఇక్కడకు వచ్చారు”అని చెప్పగా “స్వామి  రాములవారి  బ్ర హ్మోత్సవాల  విషయమై   మాట్లాడడానికి  బయలు దేరారా  ?  ” అన్నాడు . అందుకు “మహామంత్రి గారు ఈ సారి  జరగ బోయే  ఉత్సవాలకు ఒక ఆటంకం వచ్చింది . అది రాజు గారికి మనవి చేస్తామని బయలు దేరాను . ఈ ఆలయం ఎంతో పురాతనమైనది కావడంతో   ధ్వజజస్తంభం  కొంత   మేర దెబ్బతినిoది దాని స్థానంలో కొత్త ధ్వజస్తంభాన్ని   ప్రతి ష్ఠిoచాలి .  బ్రహ్మోత్సవా లలో జరిజే మొదటి తంతు లో భాగంగా    ద్వజారోహణం  ముఖ్యమైనది . ఈ విష్యాన్ని మీరు మహారాజుగారికి విన్నవించి తగిన   ఏర్పాటు చేయిస్తే ఉత్సవాలు   సజావుగా సాగుతాయి” .అన్నాడు పూజారి  .  పూజారి గారు దేవాలయం లో పూజలు ఎంతో పవిత్రంగాజరగాలి కనుక  మీరన్నట్లు ఆ  శిధిలమైన స్తంభాన్ని తొలగించి మరొక  ద్వస్తంభాన్ని  ఏర్పాటుకు   మహారాజు కి  తెలియపరుస్తాను” అని    నమస్కరించి బయలు దేరాడు .   

హరిక్షేత్రుడు   మహారాజుకు గుడి  ద్వాజ స్తంభo గురించి వివరంగా  చెప్పగానే  , రాజు రాజా గురువు కణాదుడుని పిలిపించి విషయాన్ని  మహారాజు , మహామంత్రి వివరించగా   రాజగురువు  “   ఉత్సవాలు దగ్గరలోనే వున్నాయి , ఎస్‌టి నూతన  ద్వాజ స్తంభ  ప్రతిష్టిoచాలి . అలా చేయక పోతే  ఆలయానికి ,రాజ్యానికి    అరిష్టo , కనుక మనం మన రాజ్యం పక్కనే అనేక  వృక్ష సంపదక, జంతు ,పక్షులకు నిలయమైన తీర్థావనం అనే  మహాఅరణ్యంలో జలపాతం పక్కన            ఆగమ  శాస్త్ర ప్రకారం  ద్వాజస్తంభానికి తగిన మద్ది , పలాస , బిల్వం వంటి అనేక  వృక్షాలు  వున్నాయి . వాటిలో  గుడి గాలి గోపురం ఎత్తు కలిగి  చేవ  దెలిన  నిటారుగా పెరిగిన మానును   తీసుకు వచ్చి   వడ్రంగి తో తగువిదంగా తయారు చేసి ధాన్యంలో నీటిలో వుంచి   ప్రత్యేక  పూజలతో, వేద మంత్రాలతో  ప్రతిష్ట   చేయాలి  ”. అనిచెప్పగా మహారాజు “ అలాగే  గురువర్యా..  అని నమస్కరించి, మహా   మంత్రిని పరివారం  తీసుకుని తీర్థావ నానికి వెళ్ళి ఆగమ  శాస్త్ర ప్రకారం అన్నీ   గురువుగారు చెప్పి నట్లు లక్షణాలు కలిగిన వృక్షాన్ని తీసుకుని రమ్మని  ఆజ్ఞాపించాడు . 

మహామంత్రి రాజుగారు చెప్పినట్లు పరివారంతో తీర్థావనo లోని జలపాతం  వద్దకు చేరుకు ని పరిశరాలోని వృక్షల లో  గురువుగారు చెప్పిన   లక్షణాలను కలిగి చేవదేలి నిటారుగా పెరిగిన  ఒక ఒక మద్ది చెట్టును  ఎన్నుకుని తీసుకుని పోవాలని   నిర్ణయించుకుని ‘ మంత్రి పరివారంతో దీన్ని జాగ్ర్త్తగా  గొడ్డళ్ళతో   కొట్టితీసు కెళ్లాలి మనం . అందుకు దీన్ని ఏళ్ల కొట్టితే సులువుగా మన పని అవుతుందో ఆలోచించండి   ”    అన్నాడు ఈ మాటలన్నీ  చుట్టుపక్కలవున్న    శాఖోప శాఖలుగా పెరిగి వున్న కొన్ని    వృక్షాలు హేళనగా  నవ్వి   ‘మనం ఎన్నో రకాల పూలతో ,పండ్లు ,కాయలతో సుగంధం వేద చల్లుతున్నా ..మనల్ని వదలి ఈ మద్ది చెట్టు ను కూత్కు పోతున్నారు అంటే దీని  బతుకు ఈ విధంగా తెల్లరింది .  ’ అని ఎగతాళి చేశాయి .  అందుకు మద్దిచెట్టు ‘నిజమే  ... నా తలరాత ఎలాంటి దో మీకు చెప్తాను  వినండి ...  నన్ను   నరికి  తీసుకెళ్లి దేవాలయంలో ద్వజస్తంభం గా మలచి ప్రతిష్టి స్తారు  .ఎందుకంటే గర్భగుడిలోని  మూలవిరాట్ ( విగ్రహం  కి ఎంత ప్రాధాన్యత వుందో  అంటే  ప్రాధాన్యత ద్వాజ స్తంభానికి ఇస్తారు . దేవాలయం  లో  ముందు భాగంలో వుండి    ఆలయ ప్రవేశం చేసే   భక్తులు ద్వజస్తంభాన్ని ముందుగా  దర్శించి  నమస్కరించి   సాష్టాoగా నంస్కారం చేసుకుని తర్వాత దైవదర్శనాన్ని చేసుకుంటారు .   ద్వజ స్తంభానికి    మూలవిరాట్ కు  జరిగినట్లే  నైవేద్యం ,  బలిహారణాలు ,అర్చనలు   జరుగుతాయి     స్తంభం కింద భాగంలో   కూర్మ యంత్రంన్ని   ప్రతి ష్ట సమయంలో పెడుతారు .బంగారు లేక ఇత్తడి తొడుగు ను తొడుగుతారు .  ,  ద్వజ  స్తంభానికి పై భాగంలో  వై ష్ణవాలాయం లో శ్రీచక్రమ్ ,శివాలయంలో నంది , అమ్మవారి ఆలయం లో సింహం   ప్రతిమలను వుంచుతారు.   బ్ర హ్మోత్సవాల లో  మొదటి తంతుగా ద్వజ పటం (జయపతాకం )   ద్వజ స్తంభం  పభాగంలో  నిలుపుతారు . కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపాన్ని   భక్తుల దర్శనార్ధం  వేలాడ తీస్తారు  . ఇన్ని మంచి సుగుణాలతో  ధన్యమైన నన్ను ఎందరో భక్తులు మొక్కుకునేటట్లు దేవుడు నా తల రాత రాశాడు . ఇప్పుడు మీకు అర్థ మై వుంటుందనుకుంటాను . ‘    అన్నది  .  మద్ది చెట్టు మాటలకు  అక్కడ వున్న చెట్లన్నీ సిగ్గుతో తల వంచుకున్నాయి . ‘ దేవుడు ప్రకృతి లో ఏదో ఒక   కారణం , ఉపయోగం కోసమే అన్నిటిని సృస్టించాడు . నన్ను చూసి నవ్విన మీరు ఈ ప్రజల ఆయురారోగ్య ,కోసం  ఔషదమూలికలుగా , ఆహారఓ అందించడంలో ఇంక రఃకరకాలుగా  ఉపయోగపడు తూ మే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు .కానీ మానవుడు . మన విలువలు గుర్తించి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడాలి  .అప్పుడే ప్రకృతి వైపరీత్యాలలు తగ్గుతాయి . ‘ అంది ‘నిజమే ‘ అని  తాము తలెత్తుకుని సంతోషంతో  తలలు వుగించాయి