కరోనాతో జాగ్రత్త:-జి. అరుణ్ కుమార్ 9వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం,వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా.

 కరోనా వచ్చింది కలవరం పెట్టింది
ఒకటవ  వేవ్  వచ్చింది భయాన్ని  కలిగించింది
రెండవ వేవ్ వచ్చింది మరణాలు పెంచింది
మూడవ వేవ్ రావద్దంటే జాగ్రత్తగా ఉండాలి
మూతికి మాస్కునే పెట్టాలి
చేతులు శుభ్రంగా కడగాలి
భౌతిక దూరం పాటించాలి
వ్యాక్సిన్ వేసుకోవాలి
నియమాలు పాటించాలి
కరోనాను తరుమాలి
ప్రజలంతా సుఖంగా ఉండాలి