ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ముద్దుల మేన కోడలికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

 

నిండు పున్నమి జాబిలి ని తలపించే నీ అందాల నవ్వులు చూస్తుంటే...
ప్రతిక్షణం ఆనందం అనే ఆకలితో గడిపే నా హృదయం యొక్క కడుపు నిండిపోతుంది.

ప్రేమతో పలికే నీ మధురమైన మాటలు వింటుంటే...
చేజారిన నా బాల్యపు జ్ఞాపకాలు నీ మాటల రూపంలో నా దరి చేరినట్టు ఉంది.
సంతోషంతో నీవు నా వైపు వేసే ప్రతి అడుగు నా మది ని తాకుతుంటే..
ఆహ్లాదకరమైన ఘడియలకు నా జీవితం లో కొత్తగా ఊపిరి పోసినట్టు ఉంది.
అల్లరి ఆటలు ఆడుతూ తుంటరి రాగాలు ఆలపిస్తూ నీ బొమ్మల సంపద చూసి నీవు మురిసిపోతుంటే...
మరువలేని నా బాధలన్ని ఆ క్షణంలో మాయం అయిపోతాయి.
నువ్వు వేసే ప్రతి అడుగు,
గడిపే ప్రతి ఘడియ, 
పలికే ప్రతి పలుకు,
చేసే ప్రతి చర్యలన్నీ రాబోయే రోజులలో మధురమైన, మరుపురాని, మైమరపించేవిగా ఉండాలని, నవ్వులతో నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రియమైన అఫ్షా కి బొబ్బో తో ఆటలాడించే నీ ముద్దుల మావయ్య