*కారణజన్మ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.జన్మకారణం తెలిసివస్తే,
    కారణజన్ముడివే!
   జన్మకో లక్ష్యమండాలి!
   నీతి,బుద్ధిలతో సాధించాలి!
2.హిరణ్యకశిప సంహారం!
   నరసింహావతారం!
   రాక్షసత్వం పేట్రేగింది!
   శాశ్వతత్వం సాధించలేదే!
3.రాగాలపాక *తాళ్ళపాక!*
  ఆనందాల అయ్యే!
              ఆ *అన్నమయ్య*!నందకావతారుడు!
              వాగ్గేయకారుడు!
పదకవితా పితామహుడు!
ఆయన హృదయం,
           శ్రీనివాస నివాసం!
సంగీతాన ఆ గానలహరి,
   సప్తస్వరాల సప్తగిరి!
32,000 కీర్తనల స్వరకర్త,
  ఆలపిస్తే చాలు ఓ కీర్తన!
ఆ శ్రీ వేంకటేశ్వరుడే,
  తనను తాను మరిచి నర్తన!
*బ్రహ్మ మొక్కటే!*
        *పరబ్రహ్మ మొక్కటే!*
  అన్న అన్నమయ!
   ఇలపై నడయాడిన,
                      పరబ్రహ్మమే!
3.ఇంటిపేరు *తరిగొండ!*
    భక్తి ఏడుకొండలకు,
               సరితూగే *కొండ!*
      ఆ *వెంగమాంబ!*
      ఆమె ప్రతి రచన,
        ఓ. *రసప్రవాహగంగ!*
    మాతృశ్రీ అనిపించింది!
    యోగిని గా ధన్యత!
    రచయిత్రి గా మాన్యత!
*శ్రీవేంకటేశ్వరమహత్యము!*
వంటి రచనలు చేసి,
స్వామికి వినిపించి తరించింది!
 ఆమె పేరుతో ముడిపడి ఉన్న
  *ముత్యాల హారతి,*
             హారతులకే హారతి!
  శ్రీవేంకటేశ్వరునికెంతో ప్రీతి!