ఆయుర్వేదం -కైతికాలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ఆకులలముల వైద్యమే 
అలనాటి చికిత్స విధం
మొక్కలు,వృక్షము,వేళ్ళును 
పండ్లు కాయల సుఫధం 
ఆఁహాఁ ఆయుర్వేదo 
దేవతా ఋషుల చికిత్స !

శొంఠి పిప్పళ్లు మిరియo 
అశ్వగoధి వట్టి వేళ్ళు 
తాటి బెల్లం,పసుపుతో 
తరించి గతoలో  వాళ్ళు 
ఆఁహాఁ ఆయువు పెంచే 
మూలికా చికిత్స !

పొడులు గుళికలు కషాయం 
లేహ్యం  చ్యవన ప్రాశలు 
కలికాలు,పట్లు, ఆవిరి 
రకరకాల ద్రావకాలు 
అరె తిరుగులేని వైద్యం 
సైడ్ ఎఫెక్ట్ లు లేని విధం!

సమయం కూడ చికిత్సకు 
ప్రధాన అంశం అవుతూ 
ఉదయాస్త మయ కాలo 
జీవ శక్తిని పెంచుతూ  
చిత్రం ఈ చికిత్స 
నమ్మకం మరింత రక్ష!

చరకుడు శుశ్రుతుడు గొప్ప 
 తొలి మూలికా వైద్యులు 
ఆయుర్వేద గ్రంథాల 
రచించిన మహా ఘనతలు
వీరే సాధించినారు 
ప్రగతి బాట చూపినారు!

చికిత్స పలు విధాలుగా 
శస్త్ర చికిత్స సైతమూ 
యుద్ధంలో గాయాలకు 
 సున్నితమూ.అమోఘమూ  
సహజ వైద్యం ఆయుర్వేదం 
చిరకాల ప్రకృతి ప్రసాదం!