*తీర్చిదిద్దాలి*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలలేకద మనకు ఆశలు
బాలలేకద మనకు సిరులు
బాలలే నవ సమాజానికి
సుస్థిర కరదీపికలు
బాలలే ఘనమైన నిధులు
బాలలే నవ భారతానికి
రూపుఇచ్చే శిల్పులు
బాలలకు విలువలను నేర్పి
బాలలకు ఘన విద్యగరిపి
బాలలకు సంస్కారమొసగి
ఖ్యాతిగాంచిన భారతదేశపు
ఘనచరిత్రను నూరిపోసి
భరతమాతకు అసలుసిసలు
వారసులుగ తీర్చిదిద్దాలీ!!