ఏది ఎవర సొత్తు:-గాజులనరసింహ-నాగటూరు
భార్య భర్త సొత్తా...!
భర్త భార్య సొత్తా ..!
పిల్లలు కన్నవాళ్ళ సొత్తా..!
కన్న వాళ్లు పిల్లల సొత్తా ..!
ఎవరు ..ఎవరి ...సొత్తు...?

దేహం ఆత్మ సొత్తా..!
ఆత్మ దేహం సొత్తా ..!
పండుఫలాలు తరువుల సొత్తా ...!
తరువులు మానవుల సొత్తా ..!
తరువులిచ్చు ఫలాలు మనుషుల సొత్తా ..!
ఏది ఎవరి సొత్తు ..?

కాదు కాదు ఎవరు ఎవరి సొత్తు
ఏది దేని సొత్తు..
ఇది అంతా ఒక తాత్కాలికం
స్వార్థ పిరితమైన నాటకం
భగవంతుని మాయాజాలం
జీవుడి0దు ఒక క్రియారుపకం.

ఇది అంతా తెలుసుకదా..
నాది ,నాసొంతం అన్నా మాటాలెందుకు.  మరీ.....

లోకం ఆనంతమైనది విశ్వము సువిశాలమైనది.ఇందులో..
మొదట వంచ్చిందెవ్వరో..తెలుసా..!
తుదకు మిగిలేది ఎవరో..తెలుసా...!
ఇపుడే నీది నీదన్నది యింత వుంటే..మొదటోచ్చినవాడికి ఎంత ఉండాలి.. 
వానిదానిలో నీదేంత...?
వానిది వాడు గోనిపోతే అసలు నూవ్వెంతా..? చెప్పు మనిషి...!

తరాలు మారినా యుగాలు మారినా..
వంశానుసారముగా మీ మనసులలో..విశపిరితమైన స్వార్థపు బీజాలు మొలుస్తూనే వున్నాయి...
మీపిల్లలలో ఇంకా నాటుతూనే వున్నారు. ఎందుకు..?

నాటిచరితలు అర్థం కాలేదా..
రేపటి భవిష్యత్తుపై అవగాహనా.. లేదా..?
నేటికాలంలో కరోనా వచ్చి చెప్పినా ..నీతి పాఠం బోధపడలేదా...!

ఈ అఖండ భూమండలమున మీరేనా జీవులు మిగతాచారాలు కాదా జీవులు,
వాటికి లేదా ఇందు స్తానం....?

మీకుళ్ళు కుటంత్రాల అంతర్లీన భావనల గూర్చి,బాహ్యపు ప్రవర్తనల  గూర్చి ఎన్ని జీవులు ఎన్ని రకాలుగా వాపోతున్నాయో తెలుసా ..!వాటి మనుగడ కోసం..
ఎంత సిగ్గు పడుతున్నాయో తెలుసా..మీలాంటివాళ్ళతో సహగమన0 చేస్తున్నందుకు
ఛచచా...చి చి చీ..
ఏమిటిది బతుకు ఎందుకిది బతుకు. ....