త్యాగధనుడు కార్మికుడు-గద్వాల సోమన్న

 తే.గీ:
కాంతిలీను రవి భువిని కార్మికుండు
తరువు వోలె ఫలములిచ్చు త్యాగధనుడు
కాయకష్టమెంతో జేసి కడుపు నింపు
కరములను మోడ్చి మ్రొక్కెద శిరసు వంచి
-గద్వాల సోమన్న