చిలుకల పెళ్లి(బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
చిట్టి చిలకమ్మ పెళ్లండి
చిన్నలు పెద్దలు రారండి
పచ్చ రంగు కోక చుట్టింది
పందిట్లోకి వచ్చింది !!

కాకులన్ని వచ్చాయి
పీకలు తెచ్చి ఉదాయి
నీటిలో కప్పలు వచ్చాయి
డప్పు చప్పుడు చేశాయి !!

కోడి పుంజులు వచ్చాయి
సన్నాయి రాగం పలికాయి
కోకిలమ్మ వచ్చింది
పెళ్లి మంత్రాలు చదివింది !!

పూసిన పూలు రాలాయి
అక్షంతలు చల్లినాయి
చిలకల పెళ్లి చూడండి
చల్లని దీవెనలియ్యండి !!