అమ్మ ఇంట కాంతి
ఆమె ఉన్న శాంతి
అగును సంక్రాంతి
ఓ తెలుగుబాల!
అమ్మ పంచు మమత
కుటుంబాన ఘనత
తీర్చిదిద్దు భవిత
ఓ తెలుగుబాల!
అమ్మ మనసు వెన్న
పసిడి కన్న మిన్న
ఆమె లేక సున్న
ఓ తెలుగుబాల!
అమ్మకెవరు సాటి?
ఆమె మహిని మేటి
వందనాలు కోటి
ఓ తెలుగుబాల!
అమ్మ త్యాగమూర్తి
అసమానము కీర్తి
అందరికీ స్ఫూర్తి
ఓ తెలుగుబాల!
అనురాగ దేవత
నెరవేర్చు బాధ్యత
పూజింప సభ్యత
ఓ తెలుగుబాల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి