హైలో హైలెస్సా - బాల గేయం (మణిపూసలు):---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
హైలో హైలెస్సా 
పడవలు పో లెస్సా 
 చేపల పట్టేసీ  
యాసలో పలికేస్సా !

అటుఇటు పోవాలే 
తీరం చేరాలే 
దాటే  వాళ్ళిచ్చే 
పైసలు కావాలే !

జాలరి బతుకంతా 
నీటిపై జరుగంతా 
మా తల్లి గంగమ్మ 
నడిపే సుళువoతా !

సుక్కలు పడ్డాయే 
పక్కిలు ఎగిరాయే 
రొయ్యలు రోజంతా 
రూకలు ఇచ్చాయే !

ఏటకు పోవాలే 
వాటం సూడాలే 
వలలే ఇసిరేసి 
వంతులు పంచాలే !

రాయే నా మల్లీ 
ఎదురై నువు మల్లీ 
సద్దిని అందిచ్చే 
సంబర మిదిమల్లీ !

నుదుటన బొట్టల్లే 
వత్తాలే మల్లే 
సంద్రం మింగదుపొ 
దిగులే నా తల్లే!