*వర్ష ఫలాలు *(బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
చిటపట చినుకులు టపటప కురియగ
అటు ఇటు నురికెటి  పశువులు అరుపులు
వినుచునె కనుచునె మనుజులు తలపున
సృజనల మొలకలు చిగురులు తొడగగ

 ధరణియె  మురిసెను దగదగ మెరిసెను
 తరువులు వనమునతడియుచు పిలిచెను
 మొలకలు పరిపరి విధముల మురిసెను
 పనులను మొదలిడి పరపర విసిరిరి 

గలగల జలములు చెరువుల తరలగ
నధికపు ఫలముల వరములు దొరకగ
మనుసుల ముఖములు కలకల వెలుగుల
 కిరణము వెలువడ చనువులు పెరిగెను