చిట్టి పిట్ట-బాల గేయం:-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

చిట్టి పొట్టి పిట్ట
ఎంత చిన్న పిట్ట
అందమైన పిట్ట 
ఆడి పాడే పిట్ట

ఇంద్రధనస్సు పిట్ట
ఇంద్రలోకం పిట్ట
పువ్వుల్లోన పిట్ట
గువ్వ లాంటి పిట్ట

ఆకు చాటు పిట్ట
అల్లరి చేసే పిట్ట
గూటిలోని పిట్ట
గట్టుపై కొచ్చింది

పిల్లలంతా రారండి  
పిట్టను మీరు చూడండి
బలే బలే పిట్టండి
రంగులెన్నో చెప్పండి