*పునర్జన్మ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
1.పక్షిమరణశోకం,
        శ్లోకమై జన్మించింది!
   మట్టిలో కలిసిన బీజం,
     వృక్షఫలంలో దర్శనం!
  ముక్కలు ముక్కలైన కుండ,
   ముక్కలన్నీ ఏకమై ఓ కుండ!
   శిశిరంలో మోడయిన చెట్టు,
   వసంతంలో పచ్చదనం పట్టు!
2.కోడి, గుడ్డు పొదిగి పోయి,
    మరో కోడై వస్తుంది!
   దూడనిచ్చి ఆవు పోయినా,
దూడ ఆవై నడయాడుతుంది! చీకి దొడ్లో పారేసిన టెంకే,పెరట్లో
మామిడిమొక్కవుతుంది!
పోయిన యజమానే,
మండువాలో మనవడై నిలిచి,
    మనల్ని పలకరిస్తాడు!
3.పశ్చిమాన కుంగిన సూరీడే,
    మరునాటి ఉదయభానుడు!
 అమావాస్య చీకటే,
   పున్నమి జాబిలి వెలుగులు!
వ్యర్థాలన్నీ సైక్లింగ్ లో,
         అర్థవంత పదార్థాలే!
 ఆవిరిగా మారిన భూజలం,
   ఆకాశాన వర్షించే మేఘం!
4.విజయం పూర్వం! రణం!
 పునర్జన్మ మూలం!మరణం!
  ఒక వైరస్ దుష్టుడికి,
       కోటానుకోట్ల రూపాలు!
  ఒక రసహృదయుడికి,
   *ఒక్క* వారసుడైనా రాడే!