*మన సు జయం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.మనమెన్ని ఉన్నవాళ్ళమైనా,
   మనసున్నవాళ్ళమవ్వాలి!
 మనసు ఉంటేనే జర మనిషి!
  కాకుంటే వాడో మరమనిషి!
2.స్పందించే మనసు,
   తలెత్తుకునే శిరసు,
  గల మనిషినే ,మనుషులు,
  మనసున హత్తుకుంటారు!
3.మనసు పారిజాతం,
   హృదయం నవనీతం,
   మరేల! యజ్ఞోపవీతం!
   కాదా! జన్మ పునీతం!
4.మంచి మనసు, చలివేంద్రం,
   ఆర్తుల ఆపన్నహస్తం!
  నవనవోన్మేష సౌందర్యనేత్రం!
  నిత్యానంద సుక్షేత్రం!
5.మార్పిడి చేయలేనిది,
      మనిషికి మనసొక్కటే!
  మనసుకుస్వాధీనమైనవాడు,
                              మనిషి!
  మనసుస్వాధీనమైనవాడు,
                              మహర్షి!
  మనసుని జయిస్తే,
           వాడే ప్రపంచవిజేత!
  అతడికే ప్రపంచం జోత!