ఎవరు:- సత్యవాణి

 ధరలోన ధర్మంబు నిలిపేది ఎవరు?
ధరణిజా పతిగాక వేరు ఇంకెవరు?
తాపసుల యజ్ఞమును గాచినది ఎవరు?
తల్లి కౌసల్య సుతుడుగాకెవరు?
శివుని విల్లును ఎత్తి విరిచినది ఎవరు?
శ్రీరామచంద్రుండుగాక వేరెవరు?
తండ్రిమాటను తలదాల్చినది ఏవరు?
దశరదుని ప్రియసుతుడుగాకవేరెవరు?
గుహుని ఆలింగనము జేసినది ఎవరు?
గుణనిధి శ్రీరాముగాక మరి ఎవరు?
ఘోరాటవిలోన వసించినది ఎవరు?
ఘనుడు రఘుశంశజుడు గాక ఇంకెవరు?
అహల్య శాపమును బాపినది ఎవరు?
అమరవందితుడు సమరాధికుడుగాకమరిఎవరు
ధూర్త వాలిని పరిమార్చినది ఎవరు?
ధనుద్దారి రామయ్యగాక మరిఎవరు?
అంజనా సుతునికి ఆత్మీయుడెవరు?
మునిజన హృదయవిహారి
మురహరుడు గాద?
పదితలల రావణుని పరిమార్చినది ఎవరు?
పరమాత్మ శ్రీరామమూర్తి గాక మరిఎవరు?