*మాట!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.నాటి చరిత్ర!
   నేటి నడత!
   రేపటి నవత!
2.అక్షరాల మూట!
   లలితమైన పాట!
   లక్ష్యానికి బాట!
3.మనసున రాపిడి!
    మనిషికి ఊరడి!
   మధుర మామిడి!
4.మల్లెల తోట!
   తేనెల తేట!
   వెన్నెల పంట!
5.కలం బలం!
   కంఠం స్వరం!
  కలకాలం వరం!
6.బుల్లెట్,డైనమేట్!
   కార్పెట్, హెల్మెట్!
   పేరడీ, కామెడీ!
7.పాలమీగడ, పెరుగువడ!
 కాకినాడ కాజా, బందరులడ్డు!
  ఆత్రేయపురం పూతరేకు!
   తుని తమలపాకు!
8.నిత్యం!నిర్మలం!
   ధర్మం!ధనం!
   మంత్రం!మంగళం!