మాతృభాష (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

తొలి గానేర్చిన  భాషరా
 అమ్మ చెప్పిన భాషరా
 నాన్న పలికే భాషరా
 అదే మాతృభాషరా

 ఇంటిలో మాట్లాడేటి
మిత్రులతో ఆటలాడేటి
గురువుతో చెప్పబడేటి
అదే భాష నా కిష్టము

భాషే మనిషికి అవసరం 
సుందరమైనది భావం
 పలికే భాషే మధురం
విజేతగుటే మన  కర్తవ్యం