అమ్మ(త్రిపద)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్
.అమ్మ..........
రెండక్షర
అనంతమైన ప్రేమ.

తల్లి..........
రెండక్షరాలు
అక్షరలక్షల ఆప్యాయత.

జనని...........
మూడక్షరాలు
ముజ్జగాలు నిండు అనురాగం.

మాత..........
రెండక్షరాలు
జన్మజన్మల మాయని మమత.

అంబ.........
రెండక్షరాలు
అవని యంత సహనం.