లెక్క చెప్పలేదు--డా.. కందేపి రాణీప్రసాద్.
మాస్కులు, శానిటైజర్లు దాస్తే
బ్లాక్ మార్కెటింగంటిరి
అధిక రేట్లకు మందమ్ముకునే
అధికారాన్నేమనాలి?

ధూమపానం, మద్యపానం
ఆరోగ్యానికి హానికరమని
పాఠాలు చెప్పే పంతుళ్ళు
విధుల్లో వైన్ షాపుల వద్ద!

కాటికెళ్ళడానికి ఇరవైమంది
పెళ్ళిచేసుకుంటే యాభైమంది
బారులు దీరిన బార్ల ముందు
లెక్కంతో చెప్పనే లేదు!

కనపడని కరోనా
కాటేప్పుడేస్తుందో తెలిదు
వలస కూలీల కేకులు
వినపడకుండా మ్యూట్ పెట్టారు!

విధిలోకి టాబ్లెట్ల కోసమెల్తే
వీపులు విమానం మోత మోగె
కన్నతల్లి చనిపోయిందన్నా
కడచూపుకు నోచుకోకపోయే 
కామెంట్‌లు