హక్కులు _బాధ్యతలు ..!!:- --డా.కె.ఎల్.వి.ప్రసాద్, హనంకొండ .
రెక్క లు
ముక్కలు చేసుకుని

చెమటోడ్చే 
కష్టజీవికి ....
తగిన ఫలితం 
అందిన నాడు
అది...
అసలైన ' మే_డే' !

కండలు కరిగించి 
బండలు ...
పిండిచేసి ,
రక్తాన్ని చెమటగా మార్చె ,
శ్రమశక్తికి ,
తగిన భుక్తి 
అందిన దినమే ,
అది ...
అసలైన 'మే_డే'!

బాధ్యతలు
మరువకుండా 
త్యాగాలకు ,
బెదరకుండా ,
హక్కుల ను ,
న్యాయంగా _
పరిష్కరించుకున్న ,
అపూర్వదినమే ,
అది ...
అసలయిన 'మే_డే'!

అడ్డదారులను
ఆశ్రయించకుండా ,
బ్రోకర్లవుచ్చులో _
పడకుండా ,
నిజాయతీగా 
చెమటోడ్చి ,
బాధ్యతగల వ్యక్తిగా ,
బరోసా ఇచ్చినరోజే ,
అది ...
అసలైన _సిసలైన ,
' మే_డే...!

' మే_డే,ను
అర్ధం చేసుకుందాం !
దేశప్రగతికి _
మనవంతు ,
కృషి చేద్దాం ...!!