డోలు బాబు(బాల గేయం);-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
పిల్లోడమ్మా పిల్లోడు
అల్లరి చేసే బుడ్డోడు
డోలు పట్టుకొచ్చాడు
కోళ్ల గూడు ఎక్కాడు

డమ్ డమ్ డోలు కొట్టాడు
దిబదిబ మని ఎగిరి నాడు
గూటిలోని పుంజు లేచింది
కొక్కరకో అని కూసింది

కోడి కూత విన్నారు
కథల తాతలు వచ్చారు
డోలు బాబును పిలిచారు
కథలు చెప్పమన్నారు

డోలు కొట్టుతూ పిల్లోడు
ఢిల్లీ కథను విప్పాడు
దేశ చరిత్రను చెప్పాడు
అందరి మెప్పు పొందాడు