ప్రమధ్వర రాజ్యంలో శ్రవణగిరి అనే పల్లెటూరు ఉంది. ఆఊరి చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఆపల్లెలో ఆనందుడనే పిల్లవాడున్నాడు.వాడి తల్లికి జబ్బు చేసింది. ఎన్నిమందులు వాడినా నయంకాలేదు. ఓవైద్యుడు పరీక్షించి 'ఛిద్రపత్రం'అనే ఆకులను తెస్తే ఆ ఆకులరసంతో జబ్బు నయమవుతుందని చెప్పాడు.ఆ ఆకులపై ఐదు వృత్తాలు ఉంటాయని గుర్తుచెప్పాడు. సమీప అడవిలో దొరుకుతుందన్నాడు.
ఆనందుడు బయలుదేరి అడవిలోకి చేరుకున్నాడు.ఛిద్రపత్రాలున్న మొక్కకోసం వెదుకుతూ,లోపలికెళ్ళాడు.చెట్టు పైనుండి భయంకరమైన అరుపు వినిపించింది. ఓరాక్షసుడు ఆనందుడిని పట్టుకున్నాడు. ఆనందుడు భయంతో"నన్నువదిలేయ్!మా అమ్మకు మందుకోసం వచ్చాను" అన్నాడు. అందుకు రాక్షసుడు ఫక్కున నవ్వి "నేను ఊరికే వదలను. నాకు ఓవ్రతముఉంది. అమ్మకోసం వచ్చానంటున్నావు కాబట్టి ఒక అవకాశమిస్తాను.నేను ఏపనైనా చేయగల సమర్థుడిని.నేను చెయ్యలేని పనులు మూడు చెప్పు. ఏ ఒక్క పని చేయలేకపోయినా నిన్ను వదిలిపెడతాను" అన్నాడు.
ఆనందుడు ఆలోచించి "ఏదైనా చేయగలవా?" అన్నాడు.
రాక్షసుడు చేయగలనన్నాడు.
"మాఅమ్మ జబ్బు నయంచేయి" అన్నాడు. రాక్షసుడు కొద్దిసేపు కళ్ళు మూసుకుని, తెరిచి "మీఅమ్మ జబ్బు నయంచేశాను" అన్నాడు.
"మాఇల్లు ధనధాన్యాలతో నింపుచూద్దాం!" అన్నాడు.
రాక్షసుడు కొద్దిసేపు కళ్ళుమూసుకుని తెరిచి "నింపాను"అన్నాడు.
"నేను చెప్పేవరకూ గాలి పీల్చకుండా ముక్కూ,నోరూ మూసుకుని ఉండు. చూద్దాం!"అన్నాడుఆనందుడు.
రాక్షసుడు ముక్కూ, నోరూ మూసుకున్నాడు .గాలి అందక, ఊపిరి ఆడక గిలగిలలాడిపోయాడు. ఎప్పుడైతే శ్వాస ఆగిందో, వాడి శక్తులు పనిచేయలేదు. ఆపుకోలేక ముక్కును వదిలేశాడు. ఆనందుడిని వదిలేశాడు. ఓడిపోయానని ఒప్పుకున్నాడు.
ఆనందుడు పరుగుపరుగున ఇల్లు చేరాడు. అమ్మ ఆరోగ్యంగా ఉంది. ఇంటినిండా ధన,ధాన్యాలున్నాయి.జరిగిన విషయం అమ్మకు చెప్పాడు. కొడుకు తెలివికి ఆమె మురిసిపోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి