*బాగుంటది*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాగుంటది బాగుంటది బాగుంటది
మనమంతా ఇలాచేస్తె బాగుంటది
!!బాగుంటది!!
పక్షులై నింగిలోన ఎగురుతుంటె
చేపలై నీటిలోన ఈదుతుంటె
కోతులై చెట్లపైన దూకుతుంటె
!! బాగుంటది!!
పాపలై పిట్టగూళ్ళు కట్టుకుంటె
తుమ్మెదై పూలపైన వాలుతుంటె
చిలుకలై దోరపళ్ళు కొరుకుతుంటె
!!బాగుంటది!!
మబ్బుల్లో హాయిగా తేలుతుంటె
చుక్కల్లో కచ్చకాయలాడుతుంటె
చందాయి పైన మనం ఆటలాడుతుంటె
!!బాగుంటది!!