కుచ్ "క రో" నా (బాలగేయం):-పెందోట
ఇక బడులకెప్పుడు వేసవేనా
పాడు కరోనా దాపురించెనా
మిత్రలే లేనట్టశుభ దినమేనా
మా 'నవ' ప్రగతి మాటలేనా

వైరసైనా , తుఫానైనా సరె
మనిషి మనుగడే ముప్పైతే
మన విజ్ఞానం పెద్ద సున్నేనా
తలసు కుంటేనే భయం భయం

ప్రకృతి కన్నెర చేయకుండ
వైపరీత్యాలసలు రాకుండా
వచ్చినా ఎదుర్కొనే మార్గాలు
త్వర త్వరగా ఆవిష్కరించాలి.