నవభారత నిర్మాత!:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 స్వతంత్రభరతావని,తొలి ప్రధాని,*పండిట్**జవహర్లాల్ నెహ్రూవర్ధంతి*నివాళిగా,
     -----------------------------
1.తల్లి రాణిస్వరూపం!
          తండ్రి ముత్యప్రకాశం!
   తనయుడు వజ్రం మెరుపు!
జనాకర్షణగా అందమైనరూపు ,
 సమున్నత విద్యాభ్యాసం!
స్వాతంత్ర్య సమరాన,
      అసమాన భాగస్వామ్యం!
అనంతరం నిరుపమాన,
           ప్రగతిరథ సారథ్యం!
2.గాంధీజీ ప్రధానఅనుచరుడు,
   పదవి! పార్టీ ! కన్న, ప్రజలేప్రధానంఅన్ననాయకుడు
జీవితం చివరి దాకా ప్రధాని!
3.ఆయన పేరు తలిస్తే చాలు,
   అలీన విధానం, పంచశీల,
   పంచవర్షప్రణాళికలు,
 ప్రజాస్వామ్యం,సమసమాజం,
  భారీపారిశ్రామికవిధానం,
  అన్నిటికీ మించి ,
             దేశసత్వర పురోగతి!
  మన మదుల్లో గుర్తుకొస్తాయి!
5.ఆంగ్లం మీద అధికారం!
 Robert Frost పై మమకారం,
 The Discovery of India,
Glimpses of world history,
  His Autobiography
       Toward perfection,
30 letters to his daughter,
రచనల్లో నిలిచి ఉన్నారు!
5. పిల్లల్ని ప్రేమించి ,
                  *చాచా నెహ్రూ*
    ఎర్రగులాబి ధరించి,
ఎల్లలులేని ఖ్యాతి చిరునామా!
ప్రపంచం ఇండియాని,
          నెహ్రూగా గుర్తించింది!
ఓ భారతరత్నమై,మరో,
 భారతరత్న మిచ్చిన ఘనుడు!
*శాంతివనం* పరిమళమైన,
                   అమరుడు!