*అల్విదా రమజాన్ మేరా దోస్త్*:- మొహమ్మద్ అబ్దుల్ రషీద్, రచయిత ,అనువాదకుడు కవి*

 మా ఇంట అతిథి వచ్చిండు
వరాల మూట తెచ్చిండు
పాపాలను పోగొట్టిండు 
పుణ్యాల రాశులను పోగు చేసిండు 
సహనాన్ని నేర్పిండు 
సహాయానికై ప్రేరేపించిండు
పేదల కడుపు నింపిండు 
వంటి నిండా బట్టలు తొడిగిండు 
సంతోషంలో ముుంచిండు 
పళ్ళు ఫలాల వ్యాపారులకు లాభాలు చేసిండు
ఖర్జూరాలు అమ్మే వారి నోరు తీయగా చేసిండు
వ్యాపారుల క్యాష్ బాక్స్ లు నింపండు 
ఆరాధనలో నిమగ్నం చేసిండు
 ఖుర్ ఆన్ పారాయణం  చేయించిండు
ఇఫ్తార్ విందులలో 
నా సోదర దేశ వాసులతో ఆలింగనం చేయించిండు  
ఎంతోమంది దళిత బిలాల్ల నో పరిచయం చేసిండు
ప్రేమానురాగాలు పెంపొందించిండు 
కొత్త బట్టలు కొనిచ్చిండు
అత్తరు పూయించిండు 
ఈద్ నమాజ్ చేయించి
వీడుకోలు చెప్పిండు 
అల్విదా మేరే దోస్త్ అల్విదా
మళ్లీ నీవు వచ్చే వరకు నేను ఉంటానో లేదో
నీవు మాత్రం మా ఇంటికి వస్తూ పోతూ ఉండు
వరాలు కురిపిస్తూ ఉండు
ఇదే నా చివరి కోరిక
అల్విదా మేరే రమజాన్ దోస్త్ అల్విదా
                 ***