కరోనా బాల గేయం:-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
కళ్ళు లేని ఓ కరోనా
కళ్లెము లేని గుర్రం పై
పరుగు పరుగునొచ్చి
నురగలు కక్కుతూ

పల్లె పట్నం తిరుగుతూ
గాలిలోన నీవెగురుతూ
గడియ కూడ ఆగకుండా
గాయి గాయి చేసుకుంటూ

చిన్న పెద్ద తేడాలేకుండా
అందరి లో చేరు తావు
తుమ్ముల తోను జ్వరం
దగ్గుతో ఆయాస పెడుతూ

బల్లెము లేని సమరం తో
శ్వాసాడకుండా చేస్తావు
ప్రాణాలనే తోడేస్తావు
కరుణ లేని ఓ కరోనా