వయసుతోపాటు ఆ..మార్పులు సహజం...!!:-----శ్యామ్ కుమార్ నిజామాబాద్.

 ఒకే వయసులో వున్న చిన్న,ఆడ-మగ పిల్లలు కలసి
ఆడుకున్నా,పాడుకున్నా,అది,స్వచ్చంగా,స్వేచ్చగా
ఉండేది.పెద్దలు కూడా అడ్డు చెప్పే పరిస్థితి ఉండేది 
కాదు .అయితే ఆడపిల్లలు పెరిగేకొద్దీ ,వాళ్లలో 
శారీరకంగానూ ,మానసికంగానూ ,అనేక మార్పులు 
వస్తాయి .దానితో ,సహజసిద్ధమైన ,సిగ్గు ,మగపిల్లలతో కలవకూడదనే పెద్దల కట్టుబాట్లు మొదలుఅవుతాయి.అప్పుడు తమతో కలసి 
ఆడుకోవటం లేదనే ఈర్శ్య మగపిల్లల్లో మొదలు 
అవుతుంది.ఆడపిల్లలు ,తమకంటే పెద్దవారైన 
మగపిల్లల పట్ల సహజ సిద్దంగానే ఆకర్షితులవుతారు .మాకూ అలానే జరిగింది .
నేను 14 సంవత్సరాలు వచ్చేసరికి మా స్నేహితుల లో అందరిలోకి కాస్తోకూస్తో మార్పులు రావడం గమనించాను.  సాధారణంగా బాల్యంనుంచి టీనేజ్ లోకి అడుగు పెట్టే సమయం చాలా విచిత్రంగా ఉంటుంది అంతవరకు మాతో సరి సమానంగా ఆడుకున్న మిత్రులు చాలా వరకూ వారి వారి యొక్క స్వభావాలను బట్టి స్నేహాలను  స్నేహితులను ఎన్నుకోవడం మొదలుపెడతారు.   అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు మరీ విచిత్రంగా  మారిపోయారు.
 మా మా ఐదుగురు స్నేహితులతో ఆడుకునే అమ్మాయిలు, నన్ని ,  నూర్జహాన్, సుమతి,  మున్ని,  సుజాత. వీరందరూ దాదాపుగా మా వయసు వారే అయినా కూడా   ఆ వయసు వచ్చేసరికి  మాతో కాస్త దూరం పాటించ సాగారు. మమ్మల్ని గమనించకుండా,  మమ్మల్ని అమాయకులుగా చూసేవారు. నూర్జహాన్ మరియు నన్ని ఇద్దరూ అక్కచెల్లెళ్ళు మాకంటే పెద్దవారైనా  కాలేజీ అబ్బాయిల  తో స్నేహం  మొదలుపెట్టారు.  వారితో, మాకు అర్థం కాని సంభాషణలు , వారితో తగాదా , వారితో లేనిపోని పోట్లాట  ,  మళ్లీ కొద్దిరోజుల్లోనే మళ్లీ వాళ్లతో స్నేహం .ఇదంతా  నాకు  అసలు   అర్థం కాకుండా పోయింది.  సుమతి అయితే అసలు  నాతో ఆడుకోవడం మానేసింది .  ఒక రోజు నేను స్నేహితులు ,అందరం  నూర్జహాన్ ఇంటికి వెళ్ళాం. అక్క చెల్లెలు మాట్లాడుతున్నారు కానీ వారు వారి ఇంటి పనుల్లో నిమగ్నం కావడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, మళ్ళీ ఇంటి బాధ్యతలు చేయడం  గమనించాను.  వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మగారికి వంటింట్లో సాయం చేయడం, మళ్ళీ తర్వాత కాసేపటికి బట్టలు  ఉతుకుతూ మాట్లాడటం,  మేము పక్కన కూర్చుని మాట్లాడటం చేశాం. వారి నడవడిక ,మాటలు కదలికలు, అన్నీ పెద్ద వారిలాగా అయిపోయినట్టు గమనించాను. మేము ఎప్పటిలాగా సహజంగా వారితో సన్నిహితంగా ఆడుకుంటున్న ప్పటికి వారు కాస్త దూరంగా ఉంటున్నట్లు ,జాగ్రత్తగా   మసలుతున్నట్లు అర్థమైంది. మెల్లమెల్లగా వారు మాతో ఆడుకుంటూ వుండే సమయం తగ్గిపోయింది.
 పక్కింటి  ముగ్గురు అక్కల ఇంటి బయట గుమ్మం ముందు పెద్ద కర్టెన్ కట్టేశారు. కిటికీలకు కూడా కొత్త కొత్త     కర్టెన్లు వెలిశాయి. మా ఇంటి ముందు నుంచి వెళ్లే  కాలేజీ అబ్బాయి లు  మా పక్కింటి   అక్కయ్యలు ఉండే కిటికీలను ఓ వైపు దొంగ చూపులు చూసుకుంటూ వెళ్లేవారు. అయితే  నేను అక్కయ్యలు అందరం కిటికీ రెక్కల చాటునుంచి వాళ్లను చూసి తెగ నవ్వుకునే వాళ్ళం. "చూడు చూడు ఆ అబ్బాయి ఇక్కడ కొచ్చి మెల్లిగా మన కిటికీ వైపు చూస్తాడు చూడు" అని ముందే ఒక అక్క చెప్పేది . మేము అందరూ ఉత్కంఠతో ఊపిరిబిగబట్టి చూసేవాళ్ళం. సరిగ్గా అబ్బాయి అక్కడికొచ్చి మెల్లిగా కిటికీ  వైపు చూస్తూ అలా చూడనట్టుగా వెళ్ళి పోయేవా డు.  ఇంకేముంది అందరం  కిటికీ నుంచి దూరం జరిగి పడి పడి  కడుపు పట్టుకొని  పగలబడి నవ్వే  వాళ్ళం.  ఇక నా ఫేవరెట్  కళ్యాణి పరిస్థితి అయితే  పరిస్థితి చెప్ప తరం కాదు. అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ప్రతి మూలలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అబ్బాయిలు నిలబడి  కాపు కాస్తుండే  వారు.  ఆ రోజుల్లో ప్రేమలేఖ గొడవలు చాలా  ఉండేవి . ప్రేమ లేఖలు రాయడం ఆ రోజుల్లో ఒక పెద్ద కళ.  అవి రాయడానికి స్నేహితుల సహాయం తీసుకునేవారు.   ప్రేమ లేఖ రాసే విధానాన్ని బట్టి వారి ప్రేమ సక్సెస్ అవుతుందని ,  అమ్మాయి ప్రేమిస్తుందని నమ్మేవారు. కొందరైతే ఆ ప్రేమలేఖ లో పూలు    పెట్టి పంపేవారు .  మరికొందరైతే అందులో తమ ఫోటో పెట్టి  పంపేవారు. అబ్బో చాలా రకాల ప్రేమ లేఖలు 
ఉండేవి. 
 ఇక  అసలు సమస్య అంతా ఆ ప్రేమ లేఖల ని  అందజేసే పద్ధతిలో ఉండేది. అమ్మాయికి ఎలా అంద చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి ,అది అంత ఒక పెద్ద  ప్రణాళిక.
 చాలా వరకు పేరే లేకుండా  రాసే వారు . కొందరేమో వేరే   పేరు రాసేవారు. కొందరేమో అమ్మాయి వస్తుండగా దగ్గర ,దారిలో ముందర పడ వేసి వెళ్లేవారు.  అయితే ఎ నాడు కూడా ఎ అమ్మాయి కూడా ఆ  ప్రేమ లేఖలు తీసుకున్నట్టుగా ఎక్కడా కనబడలేదు. అమ్మాయిలు కనీసం వారి వేపు కూడ చూసే వారు కాదు.  మాట్లాడాలని ఎవరైనా ప్రయత్నిస్తే కూడా అసలు  మాట్లాడే వారు కాదు. 
ఆ సమయంలోనే  మా ఇంటి ముందు అమ్మాయి నన్ను చూసి కొత్తగా ముసిముసిగా నవ్వసాగింది. నేను అటు వైపు చూడగానే ఇంట్లోకి పరిగెత్తేది. నాకది చాలా గమ్మత్తుగా విచిత్రంగా సంతోషంగా ఉండేది. అమ్మాయి నన్ను  చూస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. మా ఊరు దాదాపు పల్లెటూరు కావడం వలన ఎలాంటి అరమరికలు ఉండేవి కావు. ఒక రోజు వాళ్ళ ఇంటి లోకి వెళ్లి పోయి ఆ అమ్మాయి నేను   మాట్లాడుకోవడం మొదలుపెట్టాము .   అంతలో
 వాళ్ళ అమ్మ వచ్చి "ఏంటి శ్యాము ఇలా వచ్చావ్" అంది.  "ఏం లేదు అత్తయ్య ఊరికే    వచ్చాను "అంటూ వెళ్ళిపోయాను. తర్వాత కొద్ది రోజులకి నేను, మా నాన్నమ్మ కనబడితే అత్తయ్య మమ్మల్ని చూసి"  అమ్మ! మీ మనవడికి తొందరగా పెళ్లి   చేసేయి"అని పకపకా నవ్వింది. " వాడికి తగిన వయసు రా నీ,  చేస్తాను "అంది మా నానమ్మ. నాకు మాత్రం మా అత్తయ్య అలా ఎందుకు  అన్నదో అర్థం అయింది. నేను చాలా భయపడిపోయాను .ఆ రోజుల్లో అబ్బాయిలు ఎన్ని 
 తిక్క వేషాలు వేసినా కూడా, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా తమ పరిమితులకు లోబడి వ్యవహరించేవారు. ఇవన్నీ నమ్మేవారు కాదు. ప్రేమ వివాహలు  
 అనేది ఊరికే సినిమాల్లో మాత్రమే కనిపించేవి. పెద్దలు చేసే వివాహాలు మాత్రమే ఉండేవి. దగ్గర చుట్టాలు అందరూ దాదాపుగా పదిహేను రోజుల ముందు వచ్చి వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పెళ్లి తర్వాత దాదాపుగా 15 రోజులు ఉండే వారు. ఇంటి ముందర పెళ్లి కి వేసే పందిరి అలాగే  చాలా రోజులు ఉండిపోయేది. స్కూలు అయిపోయిన తర్వాత కాలేజీ వచ్చేసరికి అబ్బాయిలం మేము స్నేహం కొనసాగించా కానీ మా తో చదివిన  మా తో ఆడుకున్న అమ్మాయిలు దాదాపుగా కనుమరుగయ్యారు , ఎవరో కొందరు తప్ప. చాలామందికి అప్పుడే పెళ్లి అయిపోయి పిల్లాపాపలతో మాకు కనిపించేవారు.  మాతో కాలేజీ చదివే అమ్మాయిలను  వీరితో పోలిస్తే వీరు చాలా పెద్ద రకంగా  అయిపోయారు. వారిని చూసినప్పుడు కాసేపు, వీరేంటి? ఇలా పెద్దగా అయిపోయారు ? అని అనిపించినా  ఒక నిమిషం తరువాత  మర్చి పోయే వాడిని.  కొన్నాళ్ల కిందట మేము చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఈ సంగతులన్నీ మాట్లాడు కున్నాం
 చాలా విచిత్రంగా పగలబడి నవ్వు  కొన్నాం . చాలా సేపు మా వయసు లను మర్చిపోయాం చిన్నప్పటి మనస్తత్వం  మా లో  ప్రవేశించింది. మళ్లీ చిన్నపిల్ల లము    అయిపోయి పగలబడి నవ్వు కొని అన్ని  గుర్తు చేసుకున్నాము. ప్రస్తుతము మాకు కనపడకుండా పోయిన  ఎంతో    మంది స్నేహితుల   అడ్రస్లు కనుక్కొనే  కార్యక్రమం మొదలు పెట్టాం.
          
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
వయసుతో పాటు మార్పులు సహజం.. చిన్ననాటి అనుభవాలు, 1960 నుండి 1990 మధ్యలో చాలా మంది యువతీ యువకులకు ఎదురయ్యే సంఘటనలు ఇలాగే ఉంటాయి. వాటిని కళ్ళకు కట్టినట్టుగా చూపించటానికి చేసిన ప్రయత్నం అదరహో. నా ఆటోగ్రాఫ్ సినిమా గురుకొస్తుంది. ఇంకో కథకై ఎదురు చూసూ. మురళీధర్.