కుక్కపిల్ల:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కుక్కపిల్లా
రావేపిల్లా
పిలిచిన వెంటనె
చకచక పరుగుతొ
రావేపిల్లా !
పిల్లలవెంట
గబగబ నడకతొ
తోకాడిస్తూ
రావేపిల్లా !
కిలకిల పాపలు
రమ్మనగానే
బిరబిర తిరుగుతు
రావేపిల్లా !
జిలిబిలి పలుకుల
పిల్లలతోను
మిసమిస రంగుల
పూవులు విరిసిన
నవనవ తోటకు
రావేపిల్లా !
గలగల గాజుల
మా చిట్టిపాప
వలవల ఏడుపు
ఏడుస్తుంటే
కరకర మురుకులు
పట్టుకు చేత
కిరకిర తలుపు
తోసిన పిల్లా
సరసర రావే
ఓ కుక్కపిల్లా !!